రాష్ట్ర రాజకీయం విచిత్రంగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్న అన్నీ పార్టీలకు వైసీపీయే ఫుల్ టార్గెట్టయిపోయింది. నిజానికి ప్రతిపక్షాల్లో ఏ ఒక్కపార్టీకీ వైసీపీతో పోటీపడేంత సీన్ కూడా లేదు. కానీ అన్నీ పార్టీలు వైసీపీని చూసి తొడకొట్టేస్తున్నాయి. అయితే ఇక్కడ విచిత్రమేమిటంటే ఇపుడు అన్నీ పార్టీల చూపు వైసీపీ మీదే ఉన్నాయి. అంటే ఇదేదో పొత్తుల కోసమని అనుకునేరు కాదు అభ్యర్ధుల కోసం.
రాబోయే ఎన్నికల్లో ఎవరికి టికెట్లివ్వాలి ? ఎవరికి కట్ చేయాలి ? అనే విషయంలో జగన్మోహన్ రెడ్డి ఫుల్ క్లారిటితో ఉన్నారు. అవసరమైన సర్వేలన్నీ చేయించుకున్నారు. ఇంకా చేయించుకుంటున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కనీసం 50 మందికి టికెట్లు దక్కే ఛాన్స్ లేదట. ఈ నియోజకవర్గాల్లో అప్పుడే ప్రత్యామ్నాయాలను కూడా జగన్ రెడీ చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.
ఇది నిజమే అయితే మరా 50 మందో లేకపోతే ఎంతమందికి టికెట్లు దక్కకపోతే అంతమంది ఏమి చేస్తారు ? జగన్ టికెట్ ఇవ్వలేదని ఊరికే అయితే కూర్చోలేరు కదా. అలాంటి వాళ్ళంతా కచ్చితంగా ఇతరపార్టీల వైపే చూస్తారనేది టీడీపీ, జనసేన పార్టీల్లో జరుగుతున్న చర్చ. దాని ప్రకారం టీడీపీ, జనసేనల్లో ఎందులోనో ఒకపార్టీలోకి చేరి టికెట్ తీసుకుని పోటీచేస్తారని ఈ పార్టీలు నమ్ముతున్నాయి. అందుకనే అలాంటి అసంతృప్తులకు టీడీపీ, జనసేన గాలమేస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. విచిత్రమేమిటంటే వైసీపీలో ఎవరెవరికి టికెట్లు వచ్చే ఛాన్స్ లేదనే విషయాన్ని నియోజకవర్గాల వారీగా పై రెండుపార్టీలు ఎప్పటికప్పుడు ఆరాతీస్తున్నాయని సమాచారం.
నిజంగానే అలాంటి అసంతృప్తులున్నా రెండేళ్ళముందైతే ఎవరు వైసీపీని వదిలివెళ్ళరు. తమకు టికెట్ రాదని డిసైడ్ చేసుకున్నవారెవరో చివరి నిముషంలో పార్టీని వదిలి వెళతారు. మరలాంటి వాళ్ళని టీడీపీ, జనసేనలు చేర్చుకుని టికెట్లిస్తాయా ? అంటే పార్టీల్లో జరుగుతున్న చర్చలు చూస్తుంటే గట్టి అభ్యర్ధులను కూడా పెట్టుకోలేనంత బలహీనంగా ఉన్నాయని అర్ధమైపోతోంది. చివరకు ఏమవుతుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి