శ్రావణ భార్గవి - అన్నమయ్య కీర్తనల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. శ్రావణ భార్గవి ఇప్పటికే ఆ పాటను తన యూట్యూబ్ ఛానెల్ నుంచి తొలగించి, ఆడియో మార్చినా ఆ వివాదానికి ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు. దీనిపై ప్రముఖుల స్పందన ఇదీ అంటూ ఇంకా ఆ వార్తని వేడిగానే ఉంచుతున్నారు. తాజాగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కూడా ఈ ప్రశ్న ఎదురైంది. శ్రావణ భార్గవి వివాదం సమసిపోయిన తర్వాత ఈ ప్రశ్న అడిగారు. దీనిపై వైవీ సుబ్బారెడ్డి కూడా సూటిగా స్పందించారు.

సింగర్ శ్రావణ భార్గవి పాటల వివాదం టీటీడీకి సంబంధించినది కాదని అన్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. అయితే చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశముంటే పరిశీలిస్తామని, ఆమేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వాటిపై ఎలా స్పందించాలి అని ప్రశ్నించారు వైవీ సుబ్బారెడ్డి. సోషల్ మీడియా వార్తలన్నిటిపై తాము స్పందించలేం కదా అని అన్నారు. అయితే శ్రీవారికి ప్రియ భక్తుడైన అన్నమయ్య పాటకు అపచారం కలిగించడం సరికాదని ఆయన చెప్పారు. అలా అపచారం కలిగించడ మహా పాపం అని తెలిపారు.

ప్రభుత్వం ఇలా గౌరవిస్తోంది..
తొట్ట తొలి వాగ్గేయకారుడిగా అన్నమయ్యను వైసీపీ ప్రభుత్వం గౌరవిస్తోందని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి. అందుకే ఆయన పేరు తో ఏకంగా జిల్లాను ఏర్పాటు చేశామని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి. ఇటీవల తిరుమలకు అన్నమయ్య మార్గం పునరుద్ధరించడం కూడా ఆయన్ని గౌరవించుకోవడంలో భాగమేనన్నారు. సీఎం జగన్ సూచనలకు అనుగుణంగా అన్నమయ్య మార్గంను పునరుద్ధరిస్తున్నట్టు చెప్పారు వైవీ సుబ్బారెడ్డి. ప్రస్తుతం తిరుమలకు రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయని, మూడో మార్గంగా అన్న మయ్య మార్గంను త్వరలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇన్ చార్జ్ గా ఉన్న ఆయన.. విశాఖలో పర్యటించారు. జీవీఎంసీ కార్పొరేటర్లతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. స్థానిక అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. మరోవైపు వరద రాజకీయాలపై కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ వరదలు తగ్గిపోయిన తర్వాత కూడా ఇంకా రాజకీయాలు చేయాలని చూస్తోందని అన్నారు. సీఎం పర్యటనలను డిసైడ్ చేసేది టీడీపీ కాదని చురకలంటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: