ప్రస్తుతం ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది అన్న విషయం తెలిసిందే. నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు కూడా అటు సోషల్ మీడియా మాయలో మునిగిపోతున్నారు అనే చెప్పాలి. ఈ క్రమంలోని గంటల తరబడి సోషల్ మీడియాలోనే కాలం గడిపేస్తూ ఉంటారు. ఎక్కడ చూడని విధంగా ఎప్పటికప్పుడు సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందుతూ ఉండడంతో ఇక సోషల్ మీడియాను విడిచిపెట్టడానికి ఎవరూ అంతగా ఇష్టపడటం లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందరికీ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో  ఎక్కడో జరిగిన ఆసక్తికర ఘటనలు  కూడా నిమిషాల వ్యవధిలో తెలుసుకోగలుగుతున్నారు.


 ఇలా సోషల్ వీడియోలు వెలుగులోకి వచ్చి కొన్ని ఘటనల ద్వారా అందరూ షాక్ లో మునిగిపోతున్నారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి ఒక ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. కొన్ని కొన్ని సార్లు అడవుల్లో చిత్రవిచిత్రమైన చెట్లు బయట పడటం నుంచి జరుగుతూ ఉంటుంది. ఇక ఇలాంటివి జరిగితే ఇదే హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే పెంచికలపేట రేంజ్ లో విభిన్న జంతు జాతులకు వృక్ష జాతులకు నెలవు అనే విషయం తెలిసిందే. ఇక్కడ ఉన్న ఒక వృక్షం గురించి వార్త వైరల్ గా మారిపోయింది.


 పెంచికల్ పేట బీట్ పరిధిలో ఉన్న నల్లమద్ది వృక్షం లోపల ఒక పెద్ద తొర్ర ఏర్పడింది. ఇటీవలే అడవిలో గస్తి నిర్వహిస్తున్న సమయంలో అధికారులు ఇక చెట్టుకు ఏర్పడిన ఈ పెద్ద హోల్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు అని చెప్పాలి. బీట్ అధికారి దినేష్  గస్తి నిర్వహిస్తున్న సమయంలో అడవులలో తిరుగుతుండగా పెద్ద హోల్ గుర్తించాడు. సిబ్బంది  చెట్టు మొదలు నుంచి లోపలికి వెళ్లి చూడగా మనిషి పట్టేంత పెద్దగా హోల్ వుంది అన్న విషయాన్ని గుర్తించారు. ఈ విషయం తెలిసిన వారు చెట్టును చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: