మొన్నటివరకు వీడని వర్షాలు ఇప్పుడు మరోసారి దంచికొట్టనున్నాయి.. గత కొన్ని రోజులుగా కురుస్తున్నాయి. ఇప్పటికీ ఎక్కడిక్కడ ప్రాంతాలు నీటిలో ఉండి పోయాయి.ఈ సీజన్‌లోని మొదటి బలమైన తుఫాన్ డిసెంబర్ రెండో వారంలో బంగాళాఖాతంలో ఏర్పడనుందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది..అది బల పడుతుందా..లేదా అన్నది తెలియాల్సి ఉంది..


ఆ తుఫాన్ ముప్పు ఏపీకి పొంచి ఉన్నదా అనేది ట్రాక్ చేస్తున్నామని వివరించారు. మరోవైపు డిసెంబర్ 4వ తేదీ నాటికి దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఉద్భవించే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీద ఆ మరుసటి రోజు(డిసెంబర్ 5న) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు.
ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి రానున్న 48 గంటల్లో వాయుగుండంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమవుతుందని అంచనా వేస్తున్నారు.


ఆ తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ డిసెంబర్ 8వ తేదీ నాటికి తమిళనాడు పుదుచ్చేరి తీరాలకు చేరే అవకాశం ఉందని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో తూర్పు / ఆగ్నేయ దిశలో చల్లటి గాలులు వీస్తున్నాయని వాతావరణ అధికారులు చెప్పారు. ఈ అల్పపీడన ద్రోణీ ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది..


నేడు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది.రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది..ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది..ఇక రాయలసీమలో ఈరోజు, రేపు, ఎల్లుండి:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు..


మరింత సమాచారం తెలుసుకోండి: