మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్ధగా చందాదారులకన్నా నల్లకుబేరులకు మినీ స్విస్ బ్యాంకుగా పనిచేస్తోందా ? అవుననే అంటోంది సాక్షి మీడియా. మార్గదర్శి అన్నది నల్లకుబేరులకు అడ్డాగా మారినట్లు సదరు మీడియా చెప్పింది. మార్గదర్శి అక్రమాలను తవ్వేకొద్దీ పుట్టలు పుట్టలుగా అక్రమాలు వెలుగుచూస్తున్నాయట. రాష్ట్రంలోని కొందరు అక్రమసంపాదనపరులు తాము సంపాదించిన నల్లధనాన్ని దాచుకునేందుకు మార్గదర్శిని అడ్డాగా చేసుకున్నారట.





మార్గదర్శి మినీ స్విస్ బ్యంకుగా మారిపోయిందట. ఇందులో కోటిరూపాయలకు పైగా డిపాజిట్ చేసిన చందాదారుల సంఖ్య సుమారు 1100 ఉన్నట్లు బయటపడిందట. ఇంకా రికార్డులను తవ్వితే ఇంకెంతమంది బయటపడతారో చూడాలి. అంటే 1100 నుండి రు. 1100 కోట్ల డిపాజిట్లు మార్గదర్శిలో ఉన్నట్లు బయటపడింది. ఇలా డబ్బులు డిపాజిట్ చేసిన వారిలో చాలామందికి సరైన రశీదులు, డిపాజిట్ సర్టిఫికేట్లు కూడా యాజమాన్యం ఇవ్వలేదని తెలిసిందే. అంటే కోటి రూపాయలు డిపాజిట్ చేసిన వారికి కూడా సరైన రశీదులు ఇవ్వలేదంటే అది కచ్చితంగా బ్లాక్ మనీయే అని అర్ధమవుతోంది.





చిట్ ఫండ్స్ ముసుగులో బ్లాక్ మనీతో పాటు వహాలా దందా కూడా జరుగుతోందన్న విషయం బయటపడిందట. కోటి రూపాయలకు పైగా డిపాజిట్ చేసిన వాళ్ళ వివరాలు అంటే ఫోన్ నెంటర్లు, ఆధార్ కార్డులు, ప్యాన్ కార్డుల్లాంటివి ఏవీ సంస్ధ రికార్డుల్లో కనబడలేదట. అంటే అంత భారీ ఎత్తున డబ్బులు డిపాజిట్ చేసినా ఆ వివరాలు రికార్డుల్లో లేవంటే వాళ్ళ వివరాలు ఇంకెక్కడో రహస్యంగా దాచిపెట్టినట్లు అర్ధమవుతోంది.





అందుకనే మార్గదర్శిని బ్లాక్ మనీని దాచిపెట్టుకునే మినీ స్విస్ బ్యాంకుగా సదరు మీడియా అభివర్ణించింది. కోటిరూపాయలు డిపాజిట్ చేసిన వారిలో కొందరిని పిలిపించి సీఐడీ అధికారులు విచారించారు. కోటిరూపాయలు ఎలా వచ్చాయో చెప్పమని, ఆదాయపు పన్ను రిటర్న్స్ చూపమని అడిగితే ఆధారాలు చూపలేకపోయారట. అందుకనే బడాబాబుల డబ్బు ఎవరిపేరుతోనో మార్గదర్శిలో డిపాజిట్ రూపంలో చేరిందన్నది అర్ధమవుతోంది. మొత్తానికి తవ్వేకొద్దీ మార్గదర్శి అక్రమాలు బయటపడుతున్నాయి. మరి దీనికి రామోజీ ఏమి సమాధానం చెబుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: