రాబోయే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడినుండి పోటీచేస్తారో ఫైనల్ అయిపోయిందా ? అవుననే సమాధానం వినిపిస్తోంది నాగబాబు మాటలను బట్టి. తిరుపతి జిల్లాలోని నేతలు, క్యాడర్ తో నాగబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో పవన్ తిరుపతి నుండి పోటీచేసే అవకాశం ఉందన్నారు. పవన్ తమ్ముడిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా నాగబాబు చెప్పారంటే పోటీచేసే నియోజకవర్గాన్ని పవన్ ఎంపిక చేసుకుని ఉంటారనే అనిపిస్తోంది.





జిల్లా పర్యటనకు వచ్చాము కాబట్టి నేతలు, కార్యకర్తల్లో జోష్ నింపటానికి నాగబాబు ఈ ప్రకటన చేసినట్లుగా లేదు. ఎందుకంటే నేతల్లో జోష్ నింపటానికే పోటీచేసె నియోజకవర్గాన్ని నాగబాబు ప్రస్తావించాల్సొస్తే చాలా నియోజకవర్గాలో ఇలాంటి ప్రకటనలు చాలానే చేయాల్సుంటుంది. కాబట్టి నాగబాబు చెప్పినట్లుగానే పవన్ తిరుపతి నుండి పోటీచేయటం దాదాపు ఖాయమనే అనుకోవాలి. కాకపోతే ఒక్క తిరుపతి నుండి మాత్రమే పోటీచేయబోతున్నారా లేకపోతే రెండో నియోజకవర్గం నుండి కూడా పోటీచేయబోతున్నారా అన్నది తేలాలి.





ఇప్పటివరకు పవన్ పోటీచేయబోయే నియోజకవర్గంపై అధికారికంగా ఎవరు ప్రకటించలేదు. ప్రధాన కార్యదర్శి హోదాలో నాగబాబు చేసిన ప్రకటనను పార్టీ జనాలందరు అధికారిక ప్రకటనగానే చూస్తున్నారు. తిరుపతి నుండి పవన్ పోటీచేస్తే లక్ష ఓట్ల మెజారిటితో గెలిపిస్తామని గతంలోనే తిరుపతి నియోజకవర్గం నేతలు పవన్ కు ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే నాగబాబు మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.





అదేమిటంటే టీడీపీ ప్రస్తుత పరిస్ధితులను వివరించి టీడీపీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రమే దిక్కన్నారు. టీడీపీ నేతలంతా జనసేన కింద పనిచేయాల్సిందేనట. ఇలాంటి సదవకాశాన్ని పార్టీ ఉపయోగించుకుని ప్రత్యామ్నాయంగా బలపడాలని కూడా చెప్పారు. దాంతో పార్టీ నేతలు మాట్లాడుతు ఇంతకాలం టీడీపీ నేతలు తమను బాగా టార్చర్ పెట్టినట్లు ఆరోపించారు. అయితే నాగబాబు ఆ ఆరోపణలకు పెద్దగా పట్టించుకోలేదు. రాబోయే ఎన్నికల్లో రెండుపార్టీల తరపున పవనే ముఖ్యమంత్రి అభ్యర్ధి అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నేతలంతా కష్టపడి పార్టీని గెలిపించాలని చెప్పారు. మరి నాగబాబు మాటలను తమ్ముళ్ళు గమనించారో లేదో ?

మరింత సమాచారం తెలుసుకోండి: