ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత నుండి అధికార పార్టీ అయినటువంటి వైసీపీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు జరుగుతున్నాయి. ఇప్పటికే వైసిపి పార్టీ నుండి అనేక ప్రాంతాలలో సిట్ లను ఆశించి సీటు రాకపోవడంతో చాలా మంది టిడిపి , జనసేన , బిజెపి , కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఇక ఎక్కువ శాతం మంది వైసిపి పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. దాదాపుగా ఎవరు ఆయన ఇతర పార్టీలలో సీటు దక్కక ... లేక ఇతర కారణాల వల్ల తమ పార్టీలోకి వచ్చినా కూడా ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిల వారిని సాధారణంగా తమ పార్టీలోకి ఆహ్వానిస్తుంది.

ఇకపోతే తాజాగా మరో మహిళా అభ్యర్థి కూడా షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య కుమార్తె దారా పద్మజ నేడు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దారా పద్మజకు ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈమెతో పాటు నంద్యాల జిల్లా నంద్యాల జడ్‌పిటిసి సభ్యులు గోపవరం గోకుల్‌ కృష్ణా రెడ్డి వైసిపికి సోమవారం రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లో పిసిసి చీఫ్‌ వైఎస్‌ షర్మిల ఆయనకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా అహ్వానించారు. నంద్యాల వైసిపి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌ రెడ్డి పని తీరు నచ్చక, నంద్యాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని భావించి ఈ పార్టీలో చేరినట్లు గోకుల్‌ తెలిపారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఆయన బరిలో నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీలోకి రాబోయే రోజుల్లో మరి కొంతమంది కూడా చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: