ఏపీలో జ‌రుగుతున్న అసెంబ్లీ , పార్ల‌మెంటు ఎన్నిక‌లు పొరుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి. వైసీ పీ ప్ర‌వేశ పెట్టిన సంక్షేమ ప‌థ‌కాలు.. ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న నిధులు వంటివాటిని ఆలంబ‌న‌గా చేసుకుని ఆ పార్టీ దూకుడు పెంచింది. ఎన్నిక‌ల్లో ఇవే త‌మ‌ను గెలిపిస్తాయ‌ని కూడా భావిస్తోంది. అందుకే వైనాట్ 175 నినాదాన్ని అందిపుచ్చుకుంది. ఇక‌, ఇదేస‌మ‌యంలో కులం, మతం, పార్టీల‌ను కూడా చూడ‌కుండా.. తాము ప్ర‌జ‌ల‌కు సంక్షేమం అందించామ‌ని కూడా చెప్పుకొంటోంది.


మ‌రోవైపు.. రాష్ట్రంలో అభివృద్ధి లేద‌ని.. అమ‌రావ‌తిని విధ్వంసంచేశార‌ని.. రాష్ట్రానికి పెట్టుబ‌డులు రా కుండా చేశార‌ని.. దీని వ‌ల్ల రాష్ట్రం 30 ఏళ్ల‌పాటు వెన‌క్కి వెళ్లిపోయింద‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ చెబు తోంది. దీనినే ప్ర‌చారం కూడా చేస్తోంది. అదేస‌మ‌యంలో జ‌గ‌న్ చేసిన సంక్షేమ ప‌థ‌కాల‌ను తాము కూడా ఇస్తామ‌ని చెబుతోంది. అంత‌కు మించి ఇస్తామ‌ని గ‌ణాంకాల‌తో సైతం చంద్ర‌బాబు వివ‌రిస్తున్నారు. సూప‌ర్ సిక్స్ పేరుతో ప్ర‌చారాన్ని దంచి కొడుతున్నారు.


ఇక‌, పొత్తులు పెట్టుకున్న విష‌యం కూడాతెలిసిందే. బీజేపీ-జ‌న‌సేన‌-టీడీపీ కూట‌మిగా ఎన్నిక‌ల‌ను ఎదు ర్కొంటున్నాయి. అటు.. వైసీపీ, ఇటు కూట‌మి కూడా ప్ర‌చారంలో ముందుకు సాగుతున్నాయి. దీనికి తోడు ఎన్నారైల‌ను కూడా తెచ్చుకుని వారికి టికెట్‌లు ఇచ్చారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో అంద‌రి చూపూ.. ఏపీపైనే ప‌డింది. ఎవ‌రు గెలుస్తారు ?  ఎవ‌రు నిలుస్తారు ?  ఎవ‌రు ఎలాంటి ప్ర‌భావం చూపిస్తార‌నేది ఆస‌క్తిగా మారింది.


ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల మేర‌కు.. వైసీపీ ఒంట‌రిపోరు చేస్తున్న నేప‌థ్యంలో ఈపార్టీ క‌నుక విజ యం ద‌క్కించుకుంటే.. క‌నుక‌.. ఇక‌పై రాజ‌కీయాల్లో కూట‌ములు క‌ట్టేవారు.. ఒక‌టికి రెండు సార్లు ఆలోచిం చుకునే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని  అంటున్నారు. అంతేకాదు.. కూట‌మి ఓడితే ఇక‌, ఎన్నిక‌ల త‌ర్వాత‌.. మూడు పార్టీలు నిలిచే ప‌రిస్థితి ఉండ‌ద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఒక‌వేళ కూట‌మి గెలిస్తే.. వైసీపీ చీలిక‌లు దిశ‌గా సాగుతుంద‌నే లెక్క‌లు కూడా వేస్తున్నారు. ఎలా చూస్తున్నా.. ఏపీలో జ‌రుగుతున్న ఎన్నిక‌ల విష‌యంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొన‌డం  గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: