•శ్రీకాకుళం, విజయనగరంలో ఆసక్తికర పోరు
•తెలుగు దేశం పార్టీ కూటమిలో కలవరం
•గాజు గ్లాస్ ఎన్ని ఓట్లు చీలుస్తుందన్నది అంతు చిక్కని లెక్క

ఉత్తరాంధ్ర: ఉత్తరాంధ్ర జిల్లాలో రాజకీయం చాలా ఆసక్తికరంగా ఉంది.పక్క పక్క జిల్లాల వారు పైగా ఇద్దరు కూడా రాజ్యాంగ పదవులు కలిగి ఉన్నారు. అంతేగాక ఇద్దరూ కూడా మంచి మాటకారులే. అందుకే వారిలో ఒకరు స్పీకర్ అయ్యారు, ఇంకా రెండవ వారు డిప్యూటీ స్పీకర్ అవ్వడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన తమ్మినేని సీతారాం స్పీకర్ గా ఉంటూ మరోసారి ఎన్నికల రణక్షేత్రంలోకి దూకుడుగా దూకారు. ఆయనకు ఇప్పుడు తెలుగు దేశం పార్టీతో టఫ్ గానే పోరు అనేది నడుస్తోంది. అయితే ఇండిపెండెంట్ ఒకరికి గాజు గ్లాస్ గుర్తు అనేది దక్కింది. దాంతో తెలుగు దేశం పార్టీ కూటమిలో కలవరం రేగింది. గెలుపు ధీమా అనేది ఇప్పుడు అక్కడ బాగా సడలుతోంది.శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలసలో ఎవరు గెలిచినా కూడా మెజారిటీలు అనేవి తక్కువగానే వస్తాయి అని ఊహిస్తున్న వేళ గాజు గ్లాస్ ఎన్ని ఓట్లు చీలుస్తుంది అన్నదే ఇప్పుడు అంతు చిక్కని లెక్కగా మారుతోందని సమాచారం తెలుస్తుంది. ఇక తాజా పరిణామాలతో స్పీకర్ శిబిరం మరింత దూకుడు పెంచి మరీ జనంలోకి వెళ్తోంది.



మరో ఉత్తరాంధ్ర జిల్లా అయిన విజయనగరంలో కూడా అదే పరిస్థితి నెలకొంది. తెలుగు దేశం పార్టీ రెబెల్ గా మీసాల గీత పోటీ చేస్తున్నారు. అయితే ఆమెకు గాజు గ్లాస్ గుర్తు దక్కింది.పైగా ఆమె వెనక ఎంతో బలమైన సామాజిక వర్గం ఉంది. తెలుగు దేశం పార్టీకి ఈ పరిణామం అనేది ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇక అదే డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి వర్గానికి ఫుల్ జోష్ ని నింపుతోంది.ఉత్తరాంధ్ర జిల్లా అయిన విజయనగరం జిల్లాలో ఈసారి కూడా తమదే గెలుపు అన్న ధీమా వైసీపీకి ఉన్నప్పటికీ ఇపుడు గీత రెబెల్ గా పోటీ చేయడం గాజు గ్లాస్ సింబల్ రావడంతో మెజారిటీ ఎంత అన్నదే తాము లెక్క వేసుకోవాలని కోలగట్ల వర్గీయులు భావిస్తున్నారు.ఇక లేటెస్ట్ గా మారిన పొలిటికల్ ట్రెండ్స్ తో స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరి క్యాంపులలో తెగ హుషారు కనిపిస్తోంది అని అంటున్నారు. ఈ విధంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకులం, విజయనగరంలో పోటీ అనేది చాలా ఆసక్తిగా నడుస్తుంది. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: