( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ )

రాష్ట్రం కొత్త‌గా ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ఐదు సంవ‌త్స‌రాల వ‌ర‌కు టీడీపీ-బీజేపీ కూట‌మి పాల‌న సాగింది. అ యితే.. ఈ ఐదేళ్ల‌లోనూ 13 జిల్లాలు పాత‌వి అలానే సాగాయి. దీంతో త‌మ జీవితంలో ఒక్క‌సారైనా.. జిల్లాల కు పాల‌నాధికారులుగా.. మెజిస్టీరియ‌ర్ ప‌వ‌ర్స్ వినియోగించుకోవాల‌ని చూసిన అధికారులు చాలా వ‌రకు నిరాశ‌లోనే ఉండిపోయారు. కొన్ని సంద‌ర్బాల్లో ఇదే విష‌యాన్ని అప్ప‌టి ప్ర‌బుత్వానికి కూడా వెల్ల‌డించా రు. కానీ, ఖ‌ర్చుతో కూడిన ప‌నిగా భావించిన అప్ప‌టి ప్ర‌భుత్వం వీరి కోరిక‌ను మ‌న్నించ‌లేదు.


ఇక‌, 2019లో అదికారంలోకి వ‌చ్చిన వైసీపీ.. వ‌చ్చీ రావ‌డంతోనే.. కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ను జిల్లాల‌ను చేస్తామ‌ని జ‌గ‌న్ చెప్పారు. దీంతో 13 జిల్లాలు కాస్తా 25 జిల్లాలు అవుతాయ‌ని లెక్క గ‌ట్టారు. ఇలాంటి స‌మ‌యంలో అర‌కు పార్ల‌మెంటు నియోజ‌క వ‌ర్గం పెద్ద‌ది కావ‌డంతో దీనిని రెండు జిల్లాలు చేయాలంటూ.. అక్క‌డి ప్ర‌జా ప్ర‌తినిధులు స‌ర్కారుకు విన్న‌వించారు.


దీనిని కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న జ‌గ‌న్‌.. మొత్తంగా 13 జిల్లాల‌ను కూడా 26 జిల్లాల‌కుమార్పులు చేశారు. దీంతో కొత్త జిల్లాల‌తో క‌లిపి మొత్తం 26 జిల్లాల ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఏర్ప‌డింది. ఇక్క‌డే పెద్ద చిక్కు వ‌చ్చింది. మ‌రొ 14 మంది క‌లెక్ట‌ర్లు అవ‌స‌రం అయ్యారు. దీనికి కేంద్రానికి నివేదిక పంపించారు. అంత పెద్ద మొత్తంలో కేంద్రం నుంచి క‌లెక్ట‌ర్ల‌ను ఇచ్చే అవ‌కాశం లేద‌ని తెలియ‌డంతో అప్పటి వ‌ర‌కు.. డిప్యూటీ క‌లెక్ట‌ర్లుగా.. స‌హాయ‌క లెక్ట‌ర్లు గా ఉన్న‌వారికి ప్ర‌మోష‌న్లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించి .. ఆ ప‌ని చేశారు.


దీంతో గ‌త ఐదేళ్ల‌లో ఎవ‌రైతే.. త‌మ‌కు క‌లెక్ట‌ర్ గిరీ కావాల‌ని కోరుకున్నారో.. వారంతా ఈ జాబితాలోకి చేరిపోయారు. ఫ‌లితంగా కొత్త క‌లెక్ట‌ర్లు ఒక‌రిద్ద‌రిని తీసుకున్నా.. మిగిలిన 10 మందిని మాత్రం ప్రొమోష‌న్ జాబితాలో ఉంచి.. వారికి కొత్త జిల్లాల బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించిందిజ‌గ‌న్ ప్ర‌భుత్వం దీంతో వారి కోరిక‌లు ఫ‌లించాయి. ఇది వారికి సంతోషాన్ని ఇవ్వ‌డ‌మే కాకుండా ప్ర‌భుత్వంపైనా సానుకూలత‌ను పెంచ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: