మొన్నటికి మొన్న ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకోబోయేది ఎవరు? ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం గురించి చర్చ జరుగుతుంది. అయితే తమదే గెలుపు అంటే తమదే గెలుపు అంటూ ఒకవైపు కూటమి పార్టీలు ఇంకోవైపు వైసీపీ పార్టీ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రజలు ఏం తీర్పును ఇచ్చారు అన్న విషయం మాత్రం జూన్ 4వ తేదీన బయటపడబోతోంది అని చెప్పాలి.


 ఇలా ఆంధ్ర రాజకీయాల్లో గెలుపు ఓటములపై తీవ్ర స్థాయిలో ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో కొంతమంది రాజకీయ విశ్లేషకులు తమ అంచనాలతో ఇస్తున్న రివ్యూలు కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా  మారిపోతున్నాయ్. అయితే ఏపీలో వైసిపి ఎన్ని సీట్లు గెలుస్తుంది అనే విషయంపై బిజెపి లెక్క ఇదే అంటూ ఒక ప్రచారం ఊపందుకుంది. కమ్యూనిస్టు ఐడియాలజిస్ట్ అయిన రవికాంత్ చేసిన కామెంట్స్ కాస్త సంచలనంగా మారిపోయాయి. భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం ఏపీలో జగన్ మరోసారి గెలిచి అధికారాన్ని చేజిక్కించుకుంటారు అని నమ్ముతున్నారట.


 ఈ క్రమం లోనే ఎన్నికల ముందు వరకు టీడీపీ తో పొత్తు పెట్టుకుని ముందుకు సాగిన బిజెపి ఇక ఇప్పుడు జగన్కే మళ్ళీ అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉండడం తో ఇక మళ్ళీ ఇక జగన్ కు టచ్ లోకి వచ్చారట బిజెపి అధినాయకత్వం. వాస్తవానికి వైసిపికి బిజెపికి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కాకపోతే చంద్రబాబు ఉన్న కూటమి లో తాను ఉండలేను అని ఎన్డీఏతో జగన్ విభేదించారు తప్ప ఇక స్వతహాగా బిజెపితో ఆయనకు ఎలాంటి విభయదాలు లేవు. అందుకే ఇక ఇప్పుడు బిజెపి అధినాయకత్వం కూడా జగన్ మరోసారి గెలుస్తారు అని అర్థం చేసుకొని ఆయనతోటి టచ్ లోకి రావడానికి ప్రయత్నిస్తుందంటూ ఒక ప్రచారం ఊపందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: