ఒకప్పుడు కడప అంటే ఈ జిల్లా పైన ఎలాంటి చర్చలు ఉండేవి కాదు..ఓటింగ్ అంతా కూడా వైయస్ కుటుంబానికి పడుతూ ఉండేది. దీంతో కాంగ్రెస్ ఏకపక్షంగా ఉండేదని కూడా చెప్పవచ్చు. అయితే వైసీపీ పార్టీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఏకపక్షంగానే వైసిపి అక్కడ వ్యవహరిస్తోంది. వైసిపి అధినేత జగన్ ఎప్పుడూ కూడా కడప గురించి పెద్దగా ఎక్కడ పట్టించుకునే వారు కాదు. ఎన్నికల సమయంలో మినహా ఇతర జిల్లాల పైన ఎక్కువగానే ఫోకస్ పెడుతూ ఉండేవారు సీఎం జగన్.. 2014, 2019 ఎన్నికలలో  కేవలం రెండు మూడు సార్లు మాత్రమే కడపలో పర్యటించారు.


తాజాగా జరిగిన ఎన్నికలలో మాత్రం ఏకంగా ఆరుసార్లు కడపలో పర్యటించినట్లుగా తెలుస్తోంది జగన్. మొదటిసారి బస్సు యాత్రతో ప్రారంభించి ఇక్కడి నుంచి ప్రారంభించి వరుసగా ఐదు సార్లు ప్రచారం చేశారు. చివరి రోజు కూడా కడపలో ప్రచారం చేసి ఆ తరువాత పిఠాపురంలో ముగించారు. ఇంత ఉత్కంఠ పరిణామాలు కడపలో మారడానికి గల కారణం ఏమిటంటే కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల అని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఘాటైన వ్యాఖ్యలతో సీఎం జగన్ పైన ఆయన ప్రభుత్వం పైన ఇమే విరుచుకుపడింది.


అవినాష్ రెడ్డి వివేక హత్య లింకు పెట్టి మరి ప్రచారం చేశారు. మొత్తం ప్రచారాన్ని షర్మిల సునీతలే దగ్గరుండి మరి చేశారు అంతేకాకుండా ఈసారి కడప పార్లమెంటు స్థానం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏకంగా షర్మిలానే అక్కడ నిలబడింది. దీంతో అక్కడ ఓటింగ్ సరళి ఎలా ఉంది అనే విషయం పైన కూడా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.నిన్నటి మొన్నటి వరకు మౌనంగా ఉన్నప్పటికీ కాస్త గ్యాప్ దొరకడంతో ఎవరి మనోభావాలు వారు బయటపెడుతున్నారు. దీంతో రాజన్న కుటుంబమే అక్కడి ప్రజలకు ప్రాణమని ఒక ఓటు షర్మిలాకు ఒక ఓటు జగన్ కు వేశామంటూ నిర్మొహమాటం లేకుండా చెబుతున్నారట. ఎన్నో సర్వేలు చేసిన ఇలాగే చెబుతూ ఉండడంతో..మరి షర్మిల తీర్పు చారిత్రకంగా నిలుస్తుందేమో చూడాలి మరి .

మరింత సమాచారం తెలుసుకోండి: