ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా.. పవన్ కళ్యాణ్ సహా ఏకంగా 24 మంది మంత్రులు ఇదే వేదికపై మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు అనే విషయం తెలిసిందే. అయితే ఇలా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి చంద్రబాబు ఏ శాఖలను కేటాయించబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. కాగా ఇటీవల శాఖల కేటాయింపు కూడా పూర్తయింది. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా అధికారికంగా ప్రకటించింది టిడిపి ప్రభుత్వం.


 అయితే చంద్రబాబు క్యాబినెట్లో కొంతమందికి కేటాయించిన శాఖలను చూసి ఇది రాంగ్ క్యాబినెట్ అనీ నిపుణులు కొంతమంది చర్చించుకుంటున్నారు. ఎందుకంటే అంతకు ముందు గతంలో వివిధ శాఖలకు మంత్రులుగా పనిచేసి మంచి పట్టు సాధించిన వారికి ఇప్పుడు చంద్రబాబును క్యాబినెట్లో మరో శాఖ దక్కడం జరిగింది. ఇలా చంద్రబాబు ఏకంగా తన రైట్ హ్యాండ్ గా పిలుచుకునే అచ్చన్నాయుడుకు సైతం పట్టు లేని శాఖను ఇచ్చి ఇబ్బందుల్లో పెట్టేశాడు అంటూ ఎంతోమంది రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో చంద్రబాబు క్యాబినెట్లో అచ్చన్నాయుడు మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. దీంతో ఆయనకు కార్మిక శాఖ పై మంచి పట్టు ఉంది.


 ఇప్పుడు కూడా అచ్చన్నాయుడుకు కార్మిక శాఖ దక్కుతుంది అనుకున్నప్పటికీ చంద్రబాబు మాత్రం ఆయనకు వ్యవసాయ శాఖను అప్పగించారు. దీంతో వ్యవసాయ శాఖఫై పట్టు సాధించేందుకు ఆయనకు దాదాపు ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు సమయం పట్టే అవకాశం ఉందని.. దానికి బదులు ఆయనకు పట్టున్న కార్మిక శాఖలో ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లేదంటే కార్మిక శాఖను అచ్చన్నాయుడుకు కేటాయించి ఇక అచ్చన్నకు ఇచ్చిన వ్యవసాయ శాఖను నిమ్మల రామానాయుడుకు కేటాయించి ఉంటే  బాగుండేదని కొంతమంది అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు. లేదంటే అచ్చన్నకు జల వనరుల శాఖను ఇచ్చిన బాగుండేదని.. కానీ పట్టు లేని వ్యవసాయ శాఖను ఇచ్చి చంద్రబాబు ఏకంగా అచ్చన్నను  కూడా కాస్త ఇబ్బందుల్లో పెట్టేశాడు అంటూ కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: