కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రతి వారానికి వీటి ధరలు రెట్టింపు అవుతున్నాయి ఉదాహరణకి టమాటాలు చూసుకుంటే,
వారం క్రితం కేజీ టమాటా రూ.100 పలకగా ఇప్పుడు ఏకంగా రూ.200కు ఎగబాకింది. కేవలం 7 రోజుల సమయంలోనే ఈ రేంజ్ లో కూరగాయల ధరలు పెరుగుతుండటం వల్ల సామాన్యులు లబోది పోమంటున్నారు. అయితే ఈ కఠిన పరిస్థితి మనదేశంలో కాదు పాకిస్థాన్‌లో నెలకొన్నది. ఈ దేశంలో ప్రస్తుతం కూరగాయల ధరలు సామాన్యుడు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. ఈద్ అల్-అదా లేదా బక్రీద్ పండుగ సందర్భంగా పాక్‌లో నిత్యవసర వస్తుల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. పండ్లు, కూరగాయల ధరలు నియంత్రణ లేకుండా వంద రెట్లు పెరిగాయి. వ్యాపారులు కొరత ఉన్నా లేకపోయినా డిమాండ్ ను బట్టి వీటి ప్రైసెస్ ఇష్టం వచ్చినట్లు పెంచుతున్నారు.

ముఖ్యంగా లాహోర్‌లో పండ్లు, కూరగాయల వ్యాపారులు ధరలు అధికంగా పెంచుతూ పోతున్నారు. టమాటా ప్రైజెస్ పరిశీలిస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది. ప్రజలు ఏమీ కొనలేక ఆకలితో అల్లాడుతున్నారని తెలుసుకున్న ప్రభుత్వం ధరలపై నియంత్రణ తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యింది. టమాటాల రవాణాపై నిషేధం విధించింది. 144 సెక్షన్‌ను కూడా ప్రకటించింది. పెషావర్ డిప్యూటీ కమిషనర్ కూడా వ్యాపారులపై చర్యలు తీసుకున్నారు.

పాక్‌ గవర్నమెంట్ ఎన్ని చర్యలు చేపడుతున్నా మార్కెట్ ధరలు మాత్రం కంట్రోల్ కావడం లేదు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం నిర్ణయించిన ధరలను వ్యాపారులు అసలు పట్టించుకోకపోవడమే అని చెప్పవచ్చు. వీళ్లు ప్రభుత్వ ధరలకు రెట్టింపు మొత్తం వసూలు చేస్తున్నారు. పచ్చిమిర్చి, నిమ్మ కాయల ప్రైసెస్ బాగా పెంచేశారు. అల్లం, వెల్లుల్లిని 40 నుంచి 50 శాతం ఎక్కువ ధరలకు సేల్ చేస్తున్నారు. అక్కడ కిలో నిమ్మకాయలు ఏకంగా రూ.480 పలుకుతున్నాయి.

కిలో చికెన్‌ ధరను రూ.494గా ప్రభుత్వ నిర్ణయించగా.. వ్యాపారులు మాత్రం కిలో రూ.520 నుంచి రూ.700లకు అమ్ముతున్నారు. కిలో బంగాళాదుంపల ప్రైస్ 75 నుంచి 80 రూపాయలు ఉండగా.. ఎ- గ్రేడ్‌ ఉల్లి ధరలు కిలో రూ.150గా పలుకుతున్నాయి. పాక్‌ ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఇవి చాలా ఎక్కువ. 2023లోనూ ఈద్-ఉల్-అజా సమయంలో పాకిస్థాన్‌లో ధరలు భగ్గుమన్నాయి. ద్రవ్యోల్బణం వల్ల సామాన్యులు ఏవీ కొనలేక ఉపవాసాలు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: