ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే సదరు సోషల్ మీడియా యూజర్ గతంలో లోకేష్‌ను అవమానిస్తూ "పప్పు", ఇతర అవమానకరమైన పేర్లతో పలు సందేశాలను పోస్ట్ చేసాడు. ఈ వినియోగదారు టీడీపీ నాయకుడు లోకేష్ ను అసలు ఇష్టపడలేదు. చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు పంపినప్పుడు లోకేష్‌ను ఎగతాళి చేశాడు. ఆ సోషల్ మీడియా యూజర్ ట్విట్టర్ ID "దయా45"తో లోకేష్ ని ట్రోల్ చేశాడు. ఇప్పుడే అతనే సహాయం కోసం అడిగాడు, తన తండ్రి తీవ్రమైన వైద్య పరిస్థితిలో ఉన్నారని, తక్షణ సహాయం అవసరమని చెప్పాడు. ఈ విషయాన్ని మరో ట్విట్టర్ యూజర్ నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే స్పందించిన లోకేష్.. ‘ఆయనను మేం చూసుకుంటాం.. నా టీమ్ చేరుతుంది’ అని భరోసా ఇచ్చారు. కొన్ని గంటల్లోనే లోకేష్ బృందం అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కుటుంబాన్ని సంప్రదించి అవసరమైన సహాయాన్ని అందించింది. ఇటీవల తనను అవమానించిన ట్విటర్ యూజర్‌కు సాయం చేసినా లోకేష్ రాజకీయ లాభాలపైనా, ప్రతీకారంపైనా దృష్టి పెట్టలేదు. ఇంకా ఇలాంటి ఎన్నో మంచి పనులు చేసి ట్రూ లీడర్ గా లోకేష్ పేరు తెచ్చుకుంటున్నారు.
లోకేష్ ప్రజల సమస్యలను చాలా శ్రద్ధగా వింటూ వాటిని వెంటనే పరిష్కరిస్తూ నెక్స్ట్ సీఎం అయ్యే లాగానే కనిపిస్తున్నారు. బాబు లోకేష్ లో వచ్చిన ఈ మార్పును చూసి చాలా సంతోష పడిపోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. రెడ్ బుక్ పేరిట ఏపీలో అక్రమాలకు పాల్పడిన వారిని కూడా లోకేష్ ధైర్యంగా ఎదుర్కొంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి