
ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పునర్నిర్మాణం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వరాల జల్లు కురిపించేలా కామెంట్లు చేశారు. గతంలో ఏపీ, తెలంగాణకు రైల్వే బడ్జెట్ కేవలం 900 కోట్ల రూపాయలుగా ఉండేదని ఇప్పుడు ఏపీకే ఏకంగా 9,000 కోట్ల రూపాయల రైల్వే నిధులు ఇచ్చామని మోదీ చెప్పుకొచ్చారు. రైల్వే నిధుల వల్ల తీర్థయాత్రలు, టూరిజం అభివృద్ధి జరిగే ఛాన్స్ ఉంటుందని ఆయన అన్నారు.
రైల్వే ప్రాజెక్ట్స్ వల్ల రాష్ట్రాల మధ్య అనుసంధానం పెరుగుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. ఏపీలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలవుతుందని ఆయన అన్నారు. అమరావతి అభివృద్ధితో ఏపీ దశ, దిశ మారుతుందని మోదీ చెప్పుకొచ్చారు. ఏపీ రైల్వేకు గతంతో పోల్చి చూస్తే ప్రస్తుతం 10 రెట్లు అధికంగా నిదులు ఇస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రపంచ రికార్డులు సృష్టించేలా యోగా కార్యక్రమాలు నిర్వహించాలని వచ్చే 50 రోజులు ఏపీలో యోగాకు అనుకూల వాతావరణం కల్పించాలని మన యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని తెలిపారు. ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందని ఇదే వేగం రాబోయే రోజుల్లో కూడా కొనసాగాలని ఆయన తెలిపారు. భారత్ మాతాకీ జై వందేమాతరం నినాదంతో మోదీ ప్రసంగాన్ని ముగించారు.
ఏపీలో కలలు కనేవాళ్లతో పాటు వాటిని నిజం చేసేవాళ్లు ఎక్కువమంది ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. మోదీ చేసిన కామెంట్లతో రాష్ట్ర అభివృద్ధి శరవేగంగా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తే ఏపీ తక్కువ సమయంలోనే ఎదిగే ఛాన్స్ అయితే ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు