ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి నాయకులు, విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరికి ఊహించని పరిణామం ఎదురైంది. తాజాగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్ర గాయం అయింది. లండన్ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్ర గాయం అయిందని అధికారిక ప్రకటన వెలువడింది. ఆయన బాత్రూంలో జారిపడ్డారని సమాచారం అందుతుంది.  లండన్ లో  ఓ బాత్రూంలో జారిపడి ఆయన కుడి చేతికి తీవ్ర గాయం అయినట్లు సమాచారం అందుతుంది.


 ఈ నేపథ్యంలో ఆయన కుడి చేతి ఎముక విరిగినట్లు కూడా చెబుతున్నారు. దీంతో వెంటనే లండన్లోని ఓ ప్రముఖ ఆసుపత్రికి ఆయనను తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అయిన తర్వాత... హైదరాబాద్ నగరానికి తిరిగి వచ్చారు సుజనా చౌదరి. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు ఆయనను తరలించారు. ఇందులో భాగంగానే లండన్ నుంచి ఇవాళ ఉదయం రెండు గంటల ప్రాంతంలో శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దిగారు సుజనా చౌదరి.

 దీంతో ఆయన కుటుంబ సభ్యులు అలాగే,  ఆయన అనుచరులు శంషాబాద్ చేరుకొని అక్కడి నుంచి బేగంపేటలోని కిమ్స్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఆయన చేతికి సర్జరీ చేయాలని చెబుతున్నారు వైద్యులు. అయితే ఈ సర్జరీ పెద్దది కాదని అంటున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న బిజెపి శ్రేణులు అలాగే సుజనా చౌదరి అభిమానులు ఆందోళన చెందుతున్నారు..




వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: