వేసవి కాలం తుది దశకు వచ్చేసింది. గత రెండు నుండి మూడు నెలలుగా అనేక ప్రాంతాలలో తీవ్రమైన ఎండల కారణంగా జనాలు అత్యంత ఇబ్బందులు పడుతున్నారు. దానితో అనేక మంది ప్రజలు ఎప్పుడూ వర్షాలు స్టార్ట్ అవుతాయా ... ఎప్పుడు ఈ తీవ్రమైన ఉక్కపోత పోయి చల్లని వాతావరణం లో ఉండాలా అని అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలా ఉక్కపోతతో బాధపడుతూ ఎప్పుడూ వర్షాలు పడతాయా అని ఎదురు చూస్తున్న వారికి తాజాగా భారత వాతావరణ శాఖ అద్భుతమైన గుడ్ న్యూస్ ను ప్రకటించింది.

అసలు విషయం లోకి వెళితే ... దాదాపు ప్రతి సారి కూడా జూన్ 1 తరువాత ఋతు పవనాలు కేరళ లోకి వస్తాయి. ఆ తర్వాత వర్షాలు కురవడం , జూన్ మొదటి వారం లేదా రెండవ వారం నుండి తీవ్రమైన ఉక్క పోతలు పోయి వాతావరణం అంత చల్ల పడిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ సారి మే 27 వ తేదీకే కేరళ లోకి రుతు పవనాలు రాబోతున్నట్లు తెలుస్తోంది. దానితో మే నెల చివరి వరకే వర్షాలు పడే అవకాశం ఉంది. దానితో మే నెల చివరి నుండే తీవ్రమైన ఉక్క పోతలు పోయి చల్లని వాతా వరణం నెలకొనే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సంవత్సరం మే 27 వ తేదీకే కేరళ రాష్ట్రానికి రుతు పవనాలు రానున్నట్లు తాజాగా IMD సంస్థ వెల్లడించింది.

ఇక అలాగే ఈ సంస్థ ఈ సంవత్సరం వర్ష పాతం కూడా కాస్త ఎక్కువ శాతం కూడా నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. ఇది రైతులకు కూడా అద్భుతమైన గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక ఈ సారి రుతు పవనాలు ముందు రావడం , వర్ష పాతం కూడా ఎక్కువ శాతం నమోదు అయ్యే అవకాశాలు ఉండడంతో ఈ సంవత్సరం అత్యధిక మొత్తంలో పంటలు కూడా పండే అవకాశం కూడా ఉన్నట్లు అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: