
ప్రతినెల అమలు చేసే పథకాల వివరాలలో భాగంగా ఎడాది సంక్షేమ క్యాలెండర్ ని కూడా విడుదల చేసే విధంగా టిడిపి పొలిటికల్ బ్యూరో నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినా జూన్ 12వ తేదీ నాటికి తల్లికి వందనం.. పథకాన్ని అమలు చేస్తామని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికే 15 వేల రూపాయలు వేస్తామని తెలుపుతున్నారు. అలాగే అన్నదాత సుఖీభవాని మూడు విడుదలలో రైతుల ఖాతాలో జమ చేస్తామని రూ .20 వేల రూపాయలు అంటు తాజాగా తెలియజేశారు.
మొదట ఈ రెండు ప్రభుత్వ పథకాలను ప్రారంభించబోతున్నారని అలాగే అదే రోజున లక్ష మంది ఒంటరి మహిళలకు, వితంతులకు కొత్త పింఛన్లను సైతం మంజూరు చేయబోతున్నట్లు తెలియజేశారు. మొత్తానికి అటు మహిళలకు ,రైతులకు సైతం ఎట్టకేలకు జూన్ 12వ తేదీన తమ ఖాతాలో డబ్బులు జమ చేయబోతూ ఉండడంతో ఆనందాన్ని తెలియజేస్తున్నారు. మరి ఈ దెబ్బతో కూటమి ప్రభుత్వానికి మరింత మైలేజ్ పెరిగేలా ఉంటుందని ప్రజలు కూడా భావిస్తున్నారు. జూన్ 12వ తేదీన ఎంతమంది తల్లుల ఖాతాలో, రైతుల ఖాతాలో డబ్బు జమ చేస్తారో చూడాలి మరి. మొదట ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పిన సీఎం చంద్రబాబు అయినా కూడా చెప్పిన మాట ప్రకారమే అన్ని పథకాలను అమలు చేస్తానంటూ తెలిపారు.