
ధాన్యం కొనుగోళ్ల కోసం ప్రభుత్వం 8,348 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. 2021-22 రబీ సీజన్‌తో పోల్చితే 1,739 అదనపు కేంద్రాలను స్థాపించినట్లు వివరించారు. ఇప్పటివరకు 50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయినట్లు ఆయన సమాచారం అందించారు. దిగుబడి పెరిగిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల సంఖ్యను విస్తరించినట్లు స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సేకరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.
తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. వచ్చే 10 నుంచి 12 రోజుల పాటు కొనుగోలు కేంద్రాల్లో అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి అన్ని జిల్లాల కలెక్టర్లు సమన్వయంతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు.
ధాన్యం కొనుగోళ్లపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఈ దుష్ప్రచారాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం రైతుల పక్షపాతిగా నిలిచి, వారి శ్రేయస్సు కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ సీజన్‌లో సాధించిన రికార్డు దిగుబడి, కొనుగోళ్ల విజయం తెలంగాణ వ్యవసాయ రంగంలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు