ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జిల్లాల పేరు మార్పుపై రాజకీయాలు కొనసాగుతున్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. వైయస్సార్ కడప జిల్లాను పేరు మార్చుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. కేవలం వైయస్సార్ గా ఉన్న పేరును వైయస్సార్ కడప జిల్లాగా మార్చారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వైయస్సార్ జిల్లాగా మారింది.

 కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన హయాంలో పేరు మార్చారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఏపీ లో ఎన్టీఆర్ జిల్లా ( ntr ) పేరు కూడా మార్చాలని డిమాండ్ వస్తోంది. వైయస్సార్ కడప  జిల్లాగా పేరు మార్చిన చంద్రబాబు నాయు డు.. విజయవాడ ఎన్టీఆర్ జిల్లాగా పేరు మార్చాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు. తమ నాన్న పేరు మార్చినప్పుడు ఎన్టీఆర్ పేరు కూడా మార్చాల్సిందే అంటూ ఫైర్ అయ్యారు.

 ఇదే సమయంలో... మచిలీపట్నం ప్రాంతానికి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టారని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ కు కృష్ణా జిల్లా అని పేరు మార్చాలని మరి కొంతమంది చెబుతున్నారు. వైసిపి.... పార్టీ నేతలు మాత్రం వైయస్సార్ జిల్లా (YSR)  పేరు మార్చడానికి తీవ్రంగా ఖండిస్తున్నారు. తమ నాయకుడి పేరు మార్చడం దారుణం అంటున్నారు. వైయస్సార్ కడప జిల్లాగా మార్చినట్టు ఎన్టీఆర్ విజయనగరం  అన్నట్లుగా మార్చాలని సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకువస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లా లో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి...

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గా ల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌ మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తం గా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌ జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: