
హాట్ సీట్లో కూర్చున్న వాళ్లకు అధిష్టానం అండలేదు అంటే కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉంటుందో ? అందరికీ తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పెద్దగా సహకారం లేదన్న ప్రచారం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో గుప్పు మంటుంది. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి సొంతంగా సృష్టించుకున్న సమస్యలు తప్ప సీనియర్ మంత్రుల నుంచి కానీ ... పార్టీ నుంచి కానీ పెద్దగా సమస్యలు ఎదురు కాలేదు. కానీ ఇకనుంచి శీను మారే అవకాశం ఉంది అన్న చర్చ కాంగ్రెస్ నేతల్లో వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం తాజాగా ఢిల్లీలో చోటుచేసుకున్న పరిణామాలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ దగ్గరనేత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో తనకు ఎలాంటి గ్యాప్ లేదు అని పదే పదే చెబుతున్నారు. తాను ఈ విషయంలో ఎవరికీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. తాజా ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ బిగ్ షాక్ ఇచ్చారు అనే చర్చ కాంగ్రెస్ నేతల్లో సాగుతోంది. సీఎంకు ఇంతకంటే అవమానం ఏముంటుంది అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవు అని పార్టీ వర్గాలే చెప్తున్నాయి. ఢిల్లీలో ముఖ్యమంత్రిని పెట్టుకుని రాహుల్ గాంధీ కేవలం పార్టీ సంస్థాగత వ్యవహారాలు ఇంచార్జి కేసి వేణుగోపాల్ తో పాటు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ను ఫ్యామిలీతో సహా కలిశారు. వీళ్లిద్దరితో తెలంగాణ క్యాబినెట్ విస్తరణతో పాటు పార్టీ కమిటీలు ఏర్పాటుపై చర్చించారు. కానీ ఈ సమయంలో ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం పిలుపు రాలేదు. ఇది కావాలనే చేశారు తప్ప మరొకటి కాదు అన్న అభిప్రాయం కూడా కాంగ్రెస్ నేతలలో కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి పై రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ప్రచారం ఉంది. పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎంతో జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి .. కానీ ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోలేని పరిస్థితిలో ఉంది. మంత్రులు కూడా ఎవరికి వాళ్లు యమునా తీరే అన్నట్టుగా ఉన్నారు. రేవంత్ రెడ్డి పాలన చూస్తున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఇక మారదు అనే అభిప్రాయానికి వచ్చేసారు. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వంలో ఎవరు ఊహించిన మార్పులు జరిగిన ఆశ్చర్యపనవసరం లేదని చర్చలు నడుస్తున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు