చిన్న కారు కనిపించకుండా పోతుందా ? అంటే అవుననే గణాంకాలు వినిపిస్తున్నాయి .. మన భారతీయ ప్యాసింజర్ కార్ల రంగాన్ని పరిగెత్తించడంలో ఒకప్పుడు కీలక పాత్రగా నిలిచిన చిన్నకారుల అమ్మకాల్లో వేగం ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తుంది .. అయితే ఇలా తగ్గిపోవటానికి ప్రధాన కారణాలు .. ఈ విధంగా ఉన్నాయి ..

ఇదే క్రమంలో 2019  20 మధ్యకాలంలో ప్యాసింజర్ కార్ల అమ్మకాలలో 46.5% గా ఉన్న చిన్నకారుల వాటా 2023 - 24 నాటికి ఏకంగా 27.7 శాతానికి పడిపోయింది .. ప్రస్తుతం నడుస్తున్న ఈ తగ్గుదల దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా ఆందోళన వ్యక్తం చేస్తుంది .. భారత వాహన పరిశ్రమకు పునాదిగా నిలిచిన ఈ విభాగంలో డిమాండ్ ను తిరిగి పరిగెత్తించడానికి ప్రభుత్వరంగాలు తిరిగి తగిన ప్రోత్సాహాలు ఇవ్వాలని కూడా పిలుపునిచ్చింది . అలాగే అందుకు తగిన కారణాలు కూడా చెప్పుకు వచ్చింది ..

కార్ల ధరలు పెరిగిపోవడం : చిన్నకారుల ధరలు ఈ మధ్యకాలం లో క్రమం తప్పకుండా పెరుగుతూ వస్తున్నాయి .. ఇది చాలా మందికి వాటిని కొనుగోలు చేయకుండా ఆపుతూ వస్తుంది ..

పెద్ద కార్ల పై డిమాండ్ పెరగటం : అలాగే మారుతున్నమ‌న‌ జీవనశైలి మరియు అవసరాల కారణంగా పెద్ద కారుల డిమాండ్ పెరుగుతూ వస్తుంది .. అలాగే ఇవి మరింత సౌకర్వంతమైన విలాసవంతమైన కారులు గా ట్రెండింగ్ గా వస్తున్నాయి ..

డిజిటల్ మార్కెటింగ్ : డిజిటల్ మార్కెటింగ్ ద్వారా పెద్ద కార్ల ప్రమోషన్లు సామానుల‌కు దగ్గరికి బాగా చేరువవుతున్నయి .. ఇది కూడా చిన్నకారుల మార్కెటింగ్ వాటాను గణనీయంగా తగ్గిస్తుంది ..

పనులు మరియు ఇతర ఖర్చులు : అలాగే కార్ల ధరల పెరుగుదలకు పనులు ఇతర వ్యయాల కూడా ఎంతో ఎక్కువగా ఉంది .  ఈ పరిస్థితుల దృష్ట్యా చిన్నకారుల మార్కెటింగ్ తగ్గిపోతుందనే భావన తో తయారీ కంపెనీలు కూడా తమ వ్యూహాలను మార్చుకుంటూ కనిపిస్తున్నాయి ..

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: