
ఏపీలో వైసిపి ప్రతిపక్షంలోకి వచ్చి ఏడాది దాటుతోంది. ఇప్పటికి ప్రభుత్వం పై వ్యతిరేక ఉందని పలు సర్వేలు చెబుతున్న కొన్ని కీలకమైన ప్రాంతాలలో వైసిపి చాలా బలహీనంగా కనిపిస్తోంది. ఈ ఏడాది కాలంలో వైసిపి గ్రాఫ్ ఎంతవరకు పెరిగింది ? అని ప్రశ్నించుకుంటే రాయలసీమలో మాత్రం కొంతమేర బలపడింది అని అంటున్నారు. అదే సమయంలో నెల్లూరు - ప్రకాశం జిల్లాలో యధాతధ పరిస్థితి కొనసాగుతుందని చెబుతున్నారు. 2014 ఎన్నికలకు ముందు నుంచే నెల్లూరు - ప్రకాశం జిల్లాలో వైసీపీ చాలా బలంగా ఉండేది. 2024 ఎన్నికలలో ఈ రెండు జిల్లాలలో వైసీపీ ఫ్యాన్ రివర్స్‌లో తిరిగింది. కూటమి ప్రభంజనం ముందు రెక్కలు ముక్కలు అయ్యాయి. ఇక ఏపీకి నడిబొడ్డున ఉన్న కీలకమైన కృష్ణ - గుంటూరు జిల్లాలు రాజధాని జిల్లాలు.. రాజకీయంగా చైతన్యం ఉన్న జిల్లాలు ఈ రెండు జిల్లాలలో వైసిపి చాలా చోట్ల ఉనికి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది అంటున్నారు.
ఎన్నికలు జరిగి ఏడాది అవుతున్న చాలా నియోజకవర్గాలలో వైసిపి ఏమాత్రం పుంజుకోలేదట. ఇక ఉభయగోదావరి జిల్లాల విషయానికొస్తే ఈ రెండు జిల్లాలలో జనసేన + టిడిపి కాంబినేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈ రెండు జిల్లాలలో కూడా వైసిపికి ఏమాత్రం చోటి ఇవ్వటం లేదని తెలుస్తోంది. ఏపీలో ప్రభుత్వం మార్కును ఎప్పుడూ కీలకపాత్ర పోషించే ఉత్తరాంధ్ర లోని మూడు ఉమ్మడి జిల్లాలలో కూడా ప్రస్తుతానికి వైసీపీకి ఎదురుగాలే వీస్తుందని .. ఇక్కడ కూటమిలో వర్గ పోరు ఉన్నా కూడా దానిని సొమ్ము చేసుకునే స్థితిలో వైసిపి ఎంత మాత్రం లేదని చెబుతున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు