ఇరాన్  అణ్వాయుధాలు తయారుచేస్తుందని ఆరోపణ చేస్తూ .. ఇజ్రాయెల్‌ గత వారం క్రితం ‘ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌’ పేరుతో దాడులకు పాల్పడింది .. ఆ తర్వాత వెంటనే ఇరాన్ కూడా ‘ట్రూ ప్రామిస్‌ 3’పేరుతో ఇజ్రాయిల్ పై ప్రతి దాడికి దిగింది .. ఇలా ఈ రెండు దేశాల మధ్య వారం రోజులుగా దాడులు జరుగుతూనే ఉన్నాయి .. అలాగే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం పై ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి .. అయితే ఈ క్రమంలోని అగ్రరాజ్యం అమెరికా ఇరాన్ చర్చలకు రావాలని , అలాగే తమతో అణు ఒప్పందం చేసుకోవాలని ఒత్తిడికి దిగింది .. కానీ ఇరాన్ అమెరికా వార్నింగ్ ను అసలు పట్టించుకోలేదు .. ఇక దాంతో అమెరికా కూడా ఈ యుద్ధంలో  భాగమైపోయింది .. గత శనివారం రాత్రి ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలపై మెరుపు దాడులు చేసింది .. దీంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది .


ఇక ఇప్పుడు అమెరికానే ఏకంగా యుద్ధంలో ఉండడంతో యావత్ ప్రపంచం గట్టి ఆందోళన వ్యక్తం చేస్తుంది .. ఎందుకంటే ప్రధానంగా ఇజ్రాయిల్ , ఇరాన్ వివాదంలో అమెరికా వేలు పెట్టద్దని ఇప్పటికే రష్యా హెచ్చరికలు జారీ చేసింది .. అలాగే ఇరాన్ పై ఇజ్రాయిల్ చేసిన తొలి దాడిని చైనా కూడా గట్టిగా ఖండించింది .  ఇలా ప్రపంచం పై ఆధిపత్యం కోసం అమెరికా , చైనా మధ్య గత కొన్ని సంవత్సరాలుగా కోల్డ్ వార్‌ జరుగుతూనే ఉంది ఈ క్రమంలో ఇప్పుడు ఇజ్రాయిల్ తరపున అమెరికా యుద్ధంలో బరిలోకి దిగడంతో ఇప్పుడు ఇరాన్ కు సపోర్టుగా రష్యా , చైనా వస్తే పరిస్థితి ఏంటని అనేక దేశాలు గట్టి ఆందోళన చెందుతున్నాయి .. అలాగే ఈ వివాదం మూడో ప్రపంచ యుద్ధం దిశగా ప్రయాణం చేస్తుందని ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి ..


ఇక ఇప్పటికే మొదటి ప్రపంచ యుద్ధం , రెండో ప్రపంచ యుద్ధం చూసిన ఈ ప్రపంచం .. ఈ మూడో ప్రపంచ యుద్ధం అసలు కోరుకోవటం లేదు .. అదే నిశ్చయమైతే .. గతంలో ఎప్పుడు చూడని విధంగా విధ్వంసం జరగటం ఖాయం .. ప్రస్తుతం అనేక దేశాల వద్ద ఎంతో శక్తివంతమైన ఆయుధాలు కూడా ఉన్నాయి .. వేల కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగల క్షిపణులు కూడా ఉన్నాయి .. అంతేకాకుండా చాలా దేశాల వద్ద అణుబాంబులు కూడా ఉన్నాయి ఏ ఒక్క దేశం తప్పు చేసిన .. అది ప్రపంచ నాశనానికి అంతానికి కారణంగా ఉండవచ్చు .. అలాగే యుద్ధం కారణంగా ప్రధానంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని ఆర్థిక మాంద్యం ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది .. అలాగే దాదాపు కొన్ని దేశాలు ఈ మూడో ప్రపంచ యుద్ధంతో గతంలో ఎప్పుడు చూడని భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనే ప్రమాదం కూడా ఉంటుంది ..


అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల క్రమంలో మూడో ప్రపంచ యుద్ధం  వస్తుందని చాలామంది నిపుణులు అంచనా వేస్తున్నారు .. ఇక మరి ఇదే మాట నిజమైతే .. భారత్ ఎవరి వైపు ఉంటుందనే ప్రశ్నలు కూడా చాలామందిలో ఉన్నాయి .. ఇక మన పాత మిత్రుడైన ఇరాన్ వైపు ఉంటుందా ? లేక ఇజ్రాయిల్ అమెరికా తో ఉంటుందా అని గట్టి చర్చలు జరుగుతున్నాయి . అయితే నిజానికి భారత ప్రభుత్వం రెండు దేశాల మధ్య జరిగే యుద్ధంలో ప్రత్యక్షంగా ఉండదు .. ఎందుకంటే భారత్ విదేశాంగ విధానంలో ఎంతో కీలకమైన అలీన విధానాన్ని పాటిస్తుంది .. ఈ అలీన విధానం ( నాన్ అలైన్మెంట్ పాలసీ) ఈ విధానం భారత్ ను ఎంతో ప్రత్యేకంగా చూపిస్తుంది .. ప్రపంచం రెండు గ్రూపులుగా విడిపోయినప్పుడు ఏ కుటుంబంలో కూడా చేరకుండా స్వాతంత్రంగా ఉండటమే ఈ అలీన విధానం .. దీని భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ నుంచి భారత్ పాటిస్తూ వస్తుంది .. ఇప్పుడు కూడా భారత్ ప్రభుత్వం ఇదే విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది .

మరింత సమాచారం తెలుసుకోండి: