
ఇంటి టైటిల్ డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడంతో పాటు ఇంటికి సంబంధి ఏవైనా వివాదాలు ఉన్నాయేమో పరిశీలించాలి. ఇంటి పన్నులు, ఇంటిపై ఉన్న లోన్లను క్లియర్ చేశారో లేదో చెక్ చేయాలి. విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవడంతో పాటు అవసరం అనుకుంటే ఇంటికి మరమ్మత్తులు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇంటి ధర మీ బడ్జెట్‌కు సరిపోయేలా చూసుకోవడంతో పాటు మరమ్మతులు, ఇతర ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడవచ్చు. ఇంటిని కొనే ముందు, చట్టపరమైన సలహా తీసుకోవడం ద్వారా మోసపోయే అవకాశాలు ఉండవు. మీ అవసరాలు, ప్రాధాన్యతల ఆధారంగా ఇతర విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోని ఇంటిని కొనుగోలు చేస్తే మంచిది.
ఇల్లు కొనుగోలు సమయంలో వాస్తును సైతం పరిశీలించాలి. అన్ని సౌకర్యాలు ఉన్న ప్రాంతాలలో ఇల్లు కొనుగోలు చేస్తే ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చు. ఇంటి దగ్గర పార్కింగ్ స్థలం ఉందో లేదో చెక్ చేయడంతో పాటు భవిష్యత్తులో రీ సేల్ వాల్యూ ఉంటుందో లేదో గమనించాలి. ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయో లేదో చెక్ చేయడంతో పాటు బిల్డర్ క్రెడిబిలిటీ కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు