
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పొలిటికల్ లెక్కలు ఒకింత హాట్ టాపిక్ అవుతుంటాయి. ఏపీలో కుల రాజకీయాల గురించి ప్రజల మధ్య జోరుగా చర్చ జరుగుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలలో ఒకటైన వైసీపీలో ప్రముఖ నేత చేరడం ప్రస్తుతం ఒకింత సంచలనం అవుతోంది. వైసీపీకి కొత్త సారథి రాగా ఆయన ఎంట్రీతో పార్టీ పరిస్థితి మారుతుందా అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది.
ఏపీలోని ప్రధాన నియోజకవర్గాలలో ఒకటైన భీమవరంలో కాపు రాజకీయం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. కొత్త నాయకుని ఎంట్రీతో ఫ్యాన్ పార్టీ పుంజుకోవడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రంథి స్థానంలో చినిమిల్లికి అవకాశం దక్కగా చినిమిల్లి వెంకట రాయుడు వెంట నడిచే నేతలెవరనే చర్చ జరుగుతోంది. గ్రంథి శ్రీనివాస్ స్థానాన్ని అదే సామాజిక వర్గానికి చెందిన నేతను ఎంపిక చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న భీమవరం నియోజకవర్గంలో చినిమిల్లి ఎంట్రీతో పరిస్థితులు మారే అవకాశం ఉంది. వైసీపీ భవిష్యత్తులో పార్టీ నుంచి పోటీ చేసే నేతల విషయంలో ఒకింత తెలివిగా వ్యవహరిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ కసరత్తు వల్ల పార్టీకి లాభం చేకూరనుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. భీమవరంలో కాపు సామాజికవర్గం నేతలు ఎక్కువనే సంగతి తెలిసిందే.
చినిమిల్లి పార్టీ కోసం కష్టపడి భీమవరంలో వైసీపీని అధికారంలోకి తీసుకోని రావడంలో ఎంతమేర సఫలం అవుతారనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. చినిమల్లి విషయంలో జగన్ నిర్ణయం రైటేనా అనే చర్చ సైతం జరుగుతుండటం సంచలనం అవుతోంది. వైసీపీ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియాల్సి ఉంది. రాబోయే రోజుల్లో వైసీపీకి పూర్వ వైభవం వస్తుందేమో చూడాల్సి ఉంది. వైసీపీకి ఏపీలో ప్రస్తుతం 40 శతం ఓటు బ్యాంక్ ఉన్న సంగతి తెలిసిందే.