
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా ఒక కలకలాన్ని సృష్టించింది. ఈ విమాన ప్రమాదానికి గల కారణాలను నిపుణులు తెలియజేస్తూ రెండు ఇంజిన్లు వైఫల్యం వల్లే జరిగిందని భావిస్తున్నారు.. ఈ విషయం పై జరిగిన సిమ్యులేషన్ పరీక్ష ద్వారా బయటపడిందని తెలిపారు.. ఈ పరీక్షలు అధికారులు ప్రమాదం జరిగిన సమయాల్లో ఉన్నట్లుగానే లాండింగ్ గేర్ ను సైతం కిందికి దించి మరి రెక్కల ప్లాప్ లను మూసివేసి మరి పరీక్షించారట. ఆ సమయంలోనే ఈ విషయం బయటపడినట్లు తెలిపారు.
మరణించిన వారిలో 229 మంది ప్రయాణికులు ఉండగా, 12 మంది విమాన సిబ్బందితో పాటు బిజి వైద్య కళాశాలపై పడడంతో చాలామంది వైద్య విద్యార్థులు కూడా మరణించారు. విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి మాత్రం 11A సీట్లో కూర్చోవడంతో అతను బయటపడ్డారు. ఇక విమాన ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున టాటా సంస్థ ప్రకటించింది. అయితే వీటికి తోడు అదనంగా మరో 25 లక్షల రూపాయలు ఒక్కో కుటుంబానికి అందజేయబోతున్నట్లు మరొక ప్రకటనలో కూడా ఎయిర్ ఇండియా ప్రకటించింది. మరి బ్లాక్ బాక్స్ ద్వారా మరిన్ని విషయాలను బయట పెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరి పూర్తి విషయం ఎప్పుడు బయట పెడతారో చూడాలి.