ఇటీవలే ఎక్కువగా విమాన ప్రమాదాలు చాలా జరుగుతూ ఉండడంతో భయభ్రాంతులకు ప్రయాణికులు గురవుతున్నారు. అహ్మదాబాద్ సంఘటన మరువకముందే మరో విమాన ప్రమాద ఘటన జరిగింది. ఇప్పుడు తాజాగా 50 మంది ప్రయాణికులతో కూడిన రష్యా విమానం అదృశ్యమైనట్లుగా కొన్ని గంటల క్రితం వినిపించాయి. ఇలా బయలుదేరిన కొద్దిసేపటికి రాడార్ నుంచి విమానం అదృశ్యం  అయినా AN -24 ప్రయాణికుల విమానం మిస్ అయినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ విమానంలో ప్రయాణికులతో పాటుగా కొంతమంది చిన్న పిల్లలు కూడా ఉన్నారని తెలియజేశారు. తాజాగా  ఈ విమానం కుప్పకూలిపోయిందని తెలిసి మాస్కోలో ఇది కలకలాన్ని సృష్టిస్తోంది.


అంగారా ఎయిర్లైన్స్ కు చెందిన ఈ విమానం చైనా సరిహద్దుకు దగ్గరలో  ఉన్న ఆమూర్ ప్రాంతంలో టీండా నగరంలో అదృశ్యమైనట్లుగా తెలుస్తోంది. AN -24 విమానం ల్యాండింగ్ స్పాట్ కి దగ్గరగా ఉన్న సమయంలో ఒక్కసారిగా  ట్రాఫిక్ కంట్రోల్ రాడార్ స్క్రీన్ నుంచి మాయమైపోయింది.. ఈ విమానం ఇప్పుడు గాల్లోనే పేలిపోయినట్లుగా వినిపిస్తున్నాయి. విమానం ఎక్కడ కూలిపోయి ఉంటుందనే విషయంపై అధికారులు గాలిస్తున్నట్లు సమాచారం.


ప్రాంతీయ గవర్నర్ వాసిలీ ఓర్లోవ్ విమానం అదృశ్యమైనట్లుగా అంగీకరించారు.. ఈ విమానంలో 5 మంది పిల్లలు 6 మంది సిబ్బందితో పాటుగా మరో 43 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి అన్నిచోట్ల గాలిస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు. AN -24 విమానం గమ్యస్థానానికి ఇంకా కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలోనే అదృశ్యమయిందని.. ATC తో సంబంధాలు తెగిపోవడంతో సంబంధం కోసం  ప్రయత్నాలు చేసినప్పటికీ విమానానికి సంబంధించి  ఆచూకీ దొరకలేదు. దీంతో ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని తెలియజేస్తున్నారు. అలాగే రష్యా అత్యవసర మంత్రిత్వశాఖ కూడా ఇందుకు సంబంధించి సహాయక చర్యలను చేపడుతోంది. ఈ విమానం ఎక్కడ కుప్పకూలిపోయిందనే విషయంపై గాలిస్తున్నారట. ప్రయాణిక బంధువులకు కూడా నిరంతరం సమాచారాన్ని అందిస్తున్నారట అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: