తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారిపోయాయి. ముఖ్యంగా  చాలా పార్టీలు ఇన్ డైరెక్ట్ గా బీఆర్ఎస్ కే సపోర్ట్ చేసినట్టు కనిపిస్తోంది. తెలంగాణ సెంటిమెంట్ ని రెచ్చగొడుతూ ప్రతిసారి అధికారంలోకి వస్తున్న బీఆర్ఎస్ మరోసారి సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తోంది.. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ సెంటిమెంటును పూర్తిస్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది. మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో బిజెపి 8 సీట్ల మెజారిటీతో గెలిచింది. అప్పుడు బీఆర్ఎస్ కు సున్నా.. అదే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి వచ్చేసరికి 39 సీట్లు వచ్చాయి.. అది కూడా హైదరాబాదు, రంగారెడ్డి,మెదక్,సికింద్రాబాద్ ప్రాంతాల్లోనే ఈ సీట్లు ఎక్కువగా వచ్చాయి. దీనికి ప్రధాన కారణం ఇక్కడ ఆంధ్ర నుంచి వచ్చిన సెటిలర్లు ఎక్కువగా ఉంటారు.. 

ఇక్కడ బీఆర్ఎస్ కు ఓటేయకపోతే వాళ్లు మళ్లీ గెలిచి మనల్ని దెబ్బతీస్తారనే భయంతో ఓటేసినట్టు కనిపిస్తోంది. కానీ అనుకోకుండా ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఆ తర్వాత జరిగిన పార్లమెంటు శాసనమండలి ఎలక్షన్స్ లో బిజెపి గెలిచింది అంటే తెలంగాణలో బిజెపిని నమ్ముతున్నారు.. ఇదే సమయంలో సీఎం రమేష్, బిజెపిలోకి బీఆర్ఎస్ విలీనం అవుతుందని, దీనివల్ల వారిపై కేసులు ఎత్తివేయాలని బీఆర్ఎస్ అడిగినట్లు సీఎం రమేష్ కామెంట్లు చేశారు.. దీనివల్ల జనాల్లో బిజెపి చాలావరకు డామినేట్ అవుతోంది. కేసులను అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ ను తనలో చేర్చుకోవాలని బిజెపి ప్రయత్నం చేస్తుందని ఒక సంకేతం వెళ్ళింది.

ఇక ఇదే తరుణంలో తెలుగుదేశం, బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడి తెలంగాణలో పోటీ చేయాలని బీఆర్ఎస్ ఇన్ డైరెక్ట్ గా కోరుకుంటుంది. ఒకవేళ వీళ్ళు ఎక్కడైనా పోటీ చేస్తే మళ్లీ తెలంగాణను దోచుకోవడానికి ఆంధ్ర పార్టీ వచ్చిందని ఒక సెంటిమెంట్ డ్రా చేసే ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా ప్రతిసారి బిజెపి బీఆర్ఎస్ ట్రాప్ లో పడుతూ ఎలక్షన్స్ వరకు వారి సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తోంది.. అలాగే ఈసారి కూడా  బీఆర్ఎస్ సెంటిమెంటు రగిలించి స్థానిక సంస్థల ఎలక్షన్స్ హైదరాబాదులో మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో  ఎలాగైనా గెలవాలని ప్రయత్నం చేస్తుంది.. మరి ఇప్పటికైనా బీజేపీ కళ్ళు తెరిచి  ఉన్న క్యాడర్ ను కాపాడుకొని ముందుకు వెళ్తుందా, లేదంటే బీఆర్ఎస్ ట్రాప్ లో పడి తనకు తానే విఫలం అవుతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: