
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయని జై శంకర్ తెలిపారు. ఈ దాడుల తీవ్రతను తట్టుకోలేక పాకిస్తాన్ కాల్పుల విరమణ కోసం అభ్యర్థించిందని ఆయన వెల్లడించారు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లేదా ఇతర ఏ దేశం కూడా మధ్యవర్తిత్వం వహించలేదని, ఇది రెండు దేశాల మధ్య జరిగిన ప్రత్యక్ష సంభాషణల ఫలితమేనని ఆయన వివరించారు.
రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని వ్యాఖ్యానించిన జై శంకర్, అందుకే పాకిస్తాన్ తో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేశామని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ సహించేది లేదని భారత్ విధానమని, దేశ ప్రజలు, వారి ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఆరంభం మాత్రమేనని, పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపకపోతే కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. ప్రపంచానికి పాకిస్తాన్ నిజస్వరూపాన్ని తెలియజేయడంలో భారత్ విజయవంతమైందని జై శంకర్ పేర్కొన్నారు. జై శంకర్ చేసిన కామెంట్లు భారతీయులు గర్వపడే విధంగా ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు