
మద్యం కుంభకోణం ప్రస్తుతం వైసీపీ నేతలకు వణుకు పుట్టిస్తుండగా ఈ కేసులో బిగ్ బాస్ జగన్ అని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. అయితే తనను అరెస్ట్ చేసినా సింపతీ వర్కౌట్ అవుతుందని జగన్ సైతం భావిస్తున్నారు. జగన్ అరెస్ట్ విషయంలో ఏం జరగబోతుందో తమపై విమర్శలు రాకండా చంద్రబాబు, లోకేష్ ఎలా ముందడుగులు వేస్తారో చూడాల్సి ఉంది. కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి వల్ల పార్టీపై ప్రజల్లో చులకన భావం పెరుగుతుండగా ఈ సమస్యలను కూటమి సర్కార్ ఏ విధంగా అధిగమిస్తుందో చూడాలి.
ఉచిత పథకాల విషయంలో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉచిత పథకాల వల్ల ఒక విధంగా ప్రజలకు మేలు జరిగినా రాష్ట్రంపై అప్పుల భారం పెరిగితే కూడా నష్టపోయేది ప్రజలే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయాలపై ఏపీ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పవచ్చు.
రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతుండగా ఇలాంటి సమయంలో తప్పటడుగులు వేయకుండా కూటమి సర్కార్ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఏపీపై అప్పుల భారం అంతకంతకూ పెరిగితే అంతిమంగా నష్టపోయేది ప్రజలేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.