ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ చేసే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉన్నది.. ఏళ్ల తరబడి కూర్చొని చదివినా కూడా ఉద్యోగం రాని పరిస్థితి ఉంది అంతలా కాంపిటీషన్ పెరిగిపోయింది. ఇలాంటి సమయంలోనే ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ ని తెలియజేసింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ విభాగాలలో ప్రభుత్వ ఉద్యోగాలను సైతం భర్తీ చేయడానికి సంబంధించి ఏపీపీఎస్సీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై పరీక్షల విధానంలో కీలకమైన మార్పులు తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టుల సంఖ్య 200 రెట్లు దరఖాస్తులు దాటితేనే ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు.. అంటే 100 పోస్టులు ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ ఇచ్చిందంటే 200 రెట్లు అంటే 20వేల పైగా దరఖాస్తులు వస్తే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు నిర్వహించబడతాయి.

ఈ విషయం అటు నిరుద్యోగులకు చాలా గొప్ప వరం లాంటిది. గతంలో రెండు ఎగ్జామ్లు రాసే పరిస్థితి ఏర్పడేది ఒకవేళ ఈ పద్ధతి గనుక అమలులోకి వస్తే ఒక్క ఎగ్జామ్ తోనే ఉద్యోగం సంపాదించవచ్చు. దీనివల్ల సమయం కూడా వృధా అవుతోందని ఏపీపీఎస్సీ తెలియజేసింది. ఈ ప్రతిపాదన ఆమోదిస్తే చాలు ఏపీపీఎస్సీ నుంచి భర్తీ చేసి ఉద్యోగాలలో చాలా వాటికి ఒక్క పరీక్ష మాత్రమే నిర్వహించే అవకాశం ఉన్నది. తక్కువ సమయంలోనే ఎక్కువ ఉద్యోగాలను సైతం భర్తీ చేసే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయం వల్ల నిరుద్యోగులకు కూడా ప్రయోజనం కలుగుతుంది.


ఈ విషయంపై అటు ప్రభుత్వం పైన కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు నిరుద్యోగులు. వీటివల్ల పోస్టులను కూడా భర్తీ త్వరగా చేసే అవకాశం ఉంటుందని నిరుద్యోగులు కూడా తెలియజేస్తున్నారు. మరి ఇందుకు సంబంధించి ఏపీపీఎస్సీ అధికారికంగా ఈ విషయంపైన క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. ఇప్పటికే ఏపీపీఎస్సీ నుంచి పలు రకాలు ఉద్యోగాల నోటిఫికేషన్  రావడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: