- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఏపీలో చట్టసభల్లో కీలక పదవుల్లో ఉన్న ఇద్దరు నేతలు తమకు మంత్రులుగా అవకాశం ఇవ్వాలని ఒకేసారి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతూ ఉండటం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశం అయింది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు , డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామ కృష్ణంరాజు తమను మంత్రివర్గంలోకి తీసుకోవాలని కోరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కొత్తగా కొందరు సీనియర్లను క్యాబినెట్లోకి తీసుకోవాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారిలో కొందరు అంచనాలకు తగ్గట్టు పనిచేయటం లేదని చాలా రోజుల నుంచి చంద్రబాబు అసంతృప్తి తో ఉన్నారు. కొందరు మంత్రులను పదేపదే హెచ్చరిస్తున్న వారి తీరు ఏమాత్రం మారటం లేదు.


చాలామంది మంత్రులు తమ శాఖలపై ఎప్పటికి పట్టు సాధించలేదని అటు శాఖా పరంగాను . . ఇటు సొంత నియోజకవర్గాల్లోనూ విఫ‌ల‌మైన‌ట్టు చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఇక అయ్యన్నపాత్రుడు తనకు మంత్రి పదవి కచ్చితంగా వస్తుందని భావిస్తే ఆయనకు స్పీకర్ పదవి దక్కింది. ఆయ‌న కు క్యాస్ట్ కోటా లో మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్టు టాక్ ? ఇక ర‌మురామ కూడా త‌న‌కు మంత్రి ప‌దవి ఇవ్వాల‌ని బాబు పై ఒత్తిడి చేస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌రి చంద్ర‌బాబు ఈ స్పీక‌ర్ , డిప్యూటీ స్పీక‌ర్ విష‌యం లో ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో ?  చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: