
దీంతో పోలీసులు చేసేదేమీ లేక అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించినట్లు సమాచారం. ముఖ్యంగా ఎన్నికలు జరిపే విధానం పైన అవినాష్ రెడ్డి ప్రశ్నించగా తమ కార్యకర్తల పైన టిడిపి నేతలు దాడి చేస్తున్నారని,కేవలం టిడిపి వారు వైసీపీ ఏజెంట్లను మాత్రమే టార్గెట్ చేస్తున్నారంటూ ప్రశ్నించారు. పోలీసులు చేస్తున్న తీరును కూడా తప్పు పట్టడం జరిగింది.. దాడులు జరగకుండా ఆపాల్సిన పోలీసులు తనని అడ్డుకుంటున్నారని ఇంతకంటే దారుణమైన పరిస్థితి మరి ఎప్పుడూ చూడలేదంటూ పోలీసులు తీరు పైన ఫైర్ అయ్యారు అవినాష్ రెడ్డి.
ఈరోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు జరగబోతోంది. అలాగే 14వ తేదీన ఉదయం 8 గంటలకు ఈ ఓట్లను లెక్కేస్తారు. పులివెందుల ,ఒంటిమిట్ట జడ్పిటిసి ఉప ఎన్నికల సందర్భంగా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. పులివెందులలో 10,601 ఓటర్లు ఉండగా 15 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. అక్కడ వైసిపి ,టిడిపి అభ్యర్థుల మధ్య తీవ్రమైన పోటీ ఉన్నది.
అలాగే ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్ కు 30 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడ 24,606 ఓటర్లు ఉన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీగానే బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం. మరి ఫలితాల రోజున ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో చూడాలి.