కృష్ణాష్టమి పండుగ రోజున శ్రీకృష్ణుడిని పూజిస్తారు. ఈ రోజున చేసే ప్రతి పని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అయితే, ఈ పండుగ రోజున అస్సలు చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. వాటిని పాటించడం ద్వారా శ్రీకృష్ణుని అనుగ్రహం పొందుతారు. తులసి శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైనది. అందుకే కృష్ణాష్టమి రోజున తులసి ఆకులను కోయకూడదు. ఒకవేళ పూజ కోసం తులసి ఆకులు అవసరమైతే, వాటిని ఒక రోజు ముందుగానే తెచ్చి పెట్టుకోవాలి.

 కృష్ణాష్టమి రోజున పూర్తిగా శాకాహారం మాత్రమే తీసుకోవాలి. మద్యం, మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఉపవాసం చేసేవారు పాలు, పండ్లు వంటి సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.ఈ పవిత్రమైన రోజున ఎవరితోనూ గొడవపడటం, ఇతరులను కించపరచడం చేయకూడదు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.

ఈ పవిత్రమైన రోజున ఎవరితోనూ గొడవపడటం, ఇతరులను కించపరచడం చేయకూడదు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. కృష్ణాష్టమి పండుగ రోజున జుట్టు కత్తిరించడం లేదా షేవింగ్ చేయడం వంటివి చేయకూడదు. ఈ పనులను పండుగకు ముందు రోజు లేదా తర్వాత రోజు చేసుకోవచ్చు. పండుగ రోజున ఇల్లు పరిశుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదని నమ్ముతారు. అందుకే పూజకు ముందు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి

ఈ నియమాలను పాటించడం ద్వారా కృష్ణాష్టమి పండుగను మరింత శ్రద్ధతో, భక్తితో జరుపుకోవచ్చు. కృష్ణాష్టమి రోజున కృష్ణుడిని పూజించడం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈరోజు భక్తిశ్రద్దలతో కృష్ణుడిని పూజిస్తే మేలు జరుగుతుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: