జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి రాందాస్ సోరెన్ అనారోగ్య సమస్య కారణంగా శుక్రవారం రోజున మరణించారు. ఇందుకు సంబంధించి ఈయన కుమారుడు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలుపుతూ.. తన తండ్రి ఇప్పుడు మన మధ్య లేరనే బాధతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నానంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఆగస్టు 2వ తేదీన రాందాస్ తన ఇంట్లో బాత్రూంలో జారిపడ్డారని.. దీంతో రాందాస్ మెదడుకు తీవ్ర గాయం కావడంతో, అటు రక్తం కూడా గడ్డకట్టినట్లుగా వైద్యులు తెలియజేశారు. దీంతో అదేరోజు అత్యవసర చికిత్స కోసం ఢిల్లీలో మరో ఆసుపత్రికి హెలికాఫ్టర్ ద్వారా తరలించారు.


అప్పటినుంచి ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్న ఈ విద్యాశాఖ మంత్రి రాందాస్ ఆరోగ్యం క్షీణించి మృతి చెందారని తెలిపారు.. విద్యాశాఖ మంత్రి మృతికి నివాళిగా జార్ఖండ్ ప్రభుత్వం ఒకరోజు సంతాప దినాన్ని కూడా ప్రకటించారు. అయితే కేవలం రోజుల వ్యవధిలోనే ఇద్దరు కీలకమైన నేతలు మరణించడంతో అక్కడ రాజకీయాలను చాలా విషాద సంఘటనలు అలుముకున్నాయి. రాందాస్ మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు కూడా సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని ప్రకటిస్తూ ఉన్నారు.


ఈ విద్యాశాఖ మంత్రికి ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు.. సోరెన్ రాజకీయ ప్రస్థాన విషయానికి వస్తే... గోరబంధ అనే గ్రామంలో జన్మించిన సోరెన్ మధ్యతరగతి కుటుంబంకి చెందిన వ్యక్తి. మొదట అక్కడ గ్రామాలలోనే పంచాయతీ సర్పంచ్ గా తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలుపెట్టి అంచలంచెలుగా ఎదుగుతూ హేమంత్ సోరెన్ నేతృత్వంలో మంత్రివర్గంలో చాలా కీలకమైన మంత్రిగా ఎదిగారు.1990లో JMM పార్టీకి జిమ్షెడ్పూర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మళ్లీ ఘట్ శిల అసెంబ్లీ నుంచి 2005లో ప్రయత్నించగా పొత్తులో భాగంగా ఆ సీటు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడంతో.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ 2009లో అదే స్థానంలో నుంచి పోటీ చేసి మొదటిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా వెళ్లారు. ఇక 2014లో ఓడిపోయిన, 2019లో తిరిగి మళ్లీ అదే సీటును కైవసం చేసుకున్నారు. 2024 లో కూడా అదే స్థానం నుంచి గెలిచి విద్య, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: