సాధారణంగా కృష్ణాష్టమి అంటే చాలామంది కృష్ణుడు, గోపిక వేషాలు ధరించి చాలా ఘనంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఇక సాయంత్రం పూట కృష్ణుని దేవాలయాలకు వెళుతూ ఉంటారు భక్తులు. అయితే ఇప్పుడు తాజాగా హైదరాబాదులోని రామంతపూర్ లోని గోకులేనగర్లో నిన్నటి రోజున అర్ధరాత్రి తీవ్రమైన విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. కృష్ణాష్టమి వేడుకలలో భాగంగా ఊరేగింపును నిర్వహించగా అక్కడ రథానికి విద్యుత్ తీగలు తగిలి 5 మంది భక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలుస్తోంది.


కృష్ణాష్టమి కారణంగా ఆదివారం రాత్రి భక్తులు కొంతమంది ఊరేగింపు రథాన్ని లాగుతూ ఉన్న సమయంలో వాహనం మరమ్మతుకు గురి అవ్వడం చేత  ఆ రథాన్ని నిలిపివేసి.. మళ్లీ చేతులతో లాగుతూ ముందుకు తీసుకువెళ్లారు. ఈ సమయంలోనే రథానికి  విద్యుత్ తీగలు తగులుకున్నాయి ఆ రథాన్ని లాగుతున్న 9మంది యువకులకు కరెంట్ షాక్  కొట్టడంతో ఒక్కసారిగా విసిరివేగా  దూరంగా పడిపోయారు. ఈ ఘటనతో అక్కడ ఉన్న స్థానికులు కూడా భయభ్రాంతులకు లోనైనప్పటికీ అక్కడ ఉన్న కొంతమంది భక్తులు కరెంట్ షాక్ తగిలిన వారిని ప్రాథమిక చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.


అయితే అప్పటికే అందులో 5 మంది మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. మరో నలుగురికి స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారట. ఇలా మృతి చెందిన వారిలో కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, రాజేంద్రరెడ్డి, సురేష్ యాదవ్, రుద్ర వికాస్ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అయితే వీరి మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మెన్ కూడా ఉన్నట్లుగా వినిపిస్తున్నాయి. మొత్తానికి కృష్ణాష్టమి రోజున ఇలాంటి విషాద సంఘటనలు జరగడంతో రామంతపూర్ లోని ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. మరి ఈ విషయం  పైన తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: