భారతదేశాన్ని ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీయే పాలించింది. ముఖ్యంగా ఈ దేశంలో నెహ్రు హయాంలో ఎన్నో సంస్కరణలు వచ్చాయి. అయితే ఇందులో కొన్ని సంస్కరణలు ప్రజలకు ఎంతో మేలు చేసేవి ఉండగా మరికొన్ని ప్రజలను ఇబ్బందులకు గురిచేసేవి ఉన్నాయని చాలామంది అనుకుంటారు. అయితే తాజాగా నెహ్రూ పాలనపై ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈయన వల్లే దేశం సర్వనాశనమైందన్నారు. నెహ్రూ వల్లే దేశం రెండు సార్లు విభజించబడిందని ఒకటి రాడ్ క్లిప్  లైన్   విభజిస్తే, రెండవసారి సింధూ నది రెండు ముక్కలు చేసి విభజించారన్నారు. దీనివల్ల 80% సింధుజలాలు పాకిస్తాన్ కి వెళ్ళిపోయాయని, మిగతా 20 శాతం మనకు వచ్చినా, వాటి వల్ల ఉపయోగం లేకుండా పోయిందని తెలియజేశారు. 1960లో  సిమ్లా ఒప్పందంలో భాగంగా కాశ్మీర్ సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పి సింధు జలాలను వారికి వదిలేసి కాశ్మీర్ సమస్యను అలాగే వదిలేసి వచ్చారు. 

కాంగ్రెస్ రైతులకు వ్యతిరేకమని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఉంటుందా అంటూ మోడీ ఎద్దేవా చేశారు. అలాగే 42వ రాజ్యాంగ సవరణలో  భాగంగా ఎన్నికల్లో ఓడిపోతామని చెప్పి నియోజకవర్గాలను తనకు ఇష్టం వచ్చినట్లుగా పెంచేసుకున్నారు. దీనివల్ల ఎంతోమంది ఇబ్బందులకు గురయ్యారని వెనుకబడిన తరగతులంతా అలాగే ఉండిపోయారని అన్నారు.  కొన్ని దశాబ్దాల  కాంగ్రెస్ పాలనలో అసలు భారతదేశం అభివృద్ధి చెందింది లేదని కేవలం బిజెపి హయాంలోనే దేశం  ప్రపంచ దేశాలు గుర్తించే స్థాయికి వెళ్లిందని ప్రజలు కూడా అభివృద్ధి చెందుతున్నారని అన్నారు. నెహ్రూ తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల దేశం ఎంత నాశనం అయిపోయిందో, ఇప్పటికి కూడా దాని నుంచి కోలుకోలేకపోతుందని తెలియజేశారు.

ఆరోజు 370 ఆర్టికల్ రద్దు చేసి ఉంటే కాశ్మీర్లో ఇప్పటికి ఒక్క ఉగ్రవాది కూడా ఉండేవాడు కాదని ఇండియా చాలా పీస్ ఫుల్ గా ఉండేదని తెలియజేశారు. చైనా 40 కిలోమీటర్ల ముందుకు వచ్చినా ఎవరిని ఏమీ అనలేదు. అంతేకాదు నెహ్రు హయాంలోనే ఓట్ల చోరీ జరిగింది. అప్పట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ కు 13 ఓట్లు పడితే, ఈయనకు రెండు ఓట్లు ఇతరులకు మూడు ఓట్లు పడ్డాయి. దీంతో గాంధీ ఈయన కలిసి ఆ ఓట్లన్నీ తారుమారు చేసి  ఈయన మొదటి ప్రధాని అయ్యేలా చేసేసారు. ఒకవేళ సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధాని అయి ఉండి ఉంటే మాత్రం మన దేశం చైనాతో సమానంగా ఇప్పటికీ పోటీపడి జిడిపిలో మంచి స్థాయిలో ఉండేదని తెలియజేశారు. ఈ విధంగా దేశాన్ని ముంచుతూ అభివృద్ధిలో వెనుకబడి పోయేలా చేసింది నెహ్రూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఆయన మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: