
ఇప్పటికే గ్రామీణ అభివృద్ధి దిశగా కొన్ని ముఖ్యమైన అడుగులు వేయడం ప్రారంభించింది. రహదారుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, ఉపాధి హామీ పథకాన్ని మరింత విస్తరించడం వంటి చర్యలు ఆ దిశగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో మరింత ఎక్కువ మందికి ఉపాధి కల్పించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో చైతన్యం తెచ్చింది. 15వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకు పంపేలా చొరవ తీసుకోవడం, పంచాయతీ నిధులపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ తగ్గించేలా చర్యలు తీసుకోవడం గ్రామీణ ప్రాంతాల్లో మంచి ఫలితాలిచ్చాయి.
ఒకప్పుడు నిధుల కోసం ఎదురు చూసే పరిస్థితి నుంచి బయటపడిన పంచాయతీలు ఇప్పుడు చేతిలో తగిన నిధులు ఉండడంతో అభివృద్ధి పనులను వేగవంతం చేయగలుగుతున్నాయి. ఇక తాజాగా, నాలా చట్టం కింద వచ్చే పన్నుల సొమ్మును పూర్తిగా పంచాయతీలకే అప్పగించేలా జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం గ్రామీణ ప్రజల్లో విస్తృత ఆదరణ పొందుతోంది. నాలా కింద వచ్చే పన్నులపై గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పటినుంచో డిమాండ్ ఉండగా, ఇప్పుడు అది నెరవేరబోతోందనే విశ్వాసం కలిగింది. ఈ అన్ని పరిణామాలు జనసేన గ్రామీణ ప్రాతిపదికను బలోపేతం చేసుకోవడమే కాకుండా, రాబోయే స్థానిక ఎన్నికల్లో వైసీపీకి గట్టి షాక్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు స్పష్టంగా చూపిస్తున్నాయి.