ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎరువుల కొరత కనిపించడంతో సీఎం చంద్రబాబు కేంద్రాన్ని బతిమలాడి తెప్పించడంతో రైతులు ఆనందపడ్డారు.. కానీ ఆ ఎరువులను టిడిపి నేతలు కొంతమంది దారి మళ్ళించారనే విషయం సీఎం చంద్రబాబు వరకు వెళ్ళింది. దీంతో ఇలాంటి నేతల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని వారు ఎవరు? వారు ఎందుకు దారి మళ్ళించాలనే విషయం 24 గంటలలో తేల్చాలి అంటూ సీఎం చంద్రబాబు వ్యవసాయ మంత్రి అయిన అచ్చెన్నాయుడును హెచ్చరించారట. తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టవద్దు అంటు ఆదేశాలను జారీ చేసినట్లు వినిపిస్తున్నాయి.


ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రవ్యాప్తంగా రైతులు యూరియా, డిఎపి వంటి ఎరువుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో కంటే ఎక్కువగానే ఏపీకి ఎరువులు తీసుకువచ్చారు.. కానీ అలా వచ్చిన పాయింట్ నుంచి ఎరువులు సగానికి పైగా దారిమల్లాయని దీంతో దొంగ పేర్లతో నకిలీ రైతుల పేర్లతో కొంతమంది నేతలు ఎరువులను దారి మళ్ళించారనే ఆరోపణలు వెళ్లిపడ్డాయి. అయితే ఈ విషయం జరిగి ఇప్పటికీ మూడు నాలుగు రోజులు అవుతోందట. ఈ విషయాన్ని టిడిపి అనుకూలం మీడియానే పెద్ద ఎత్తున హైలెట్ చేయడంతో ఈ విషయం పైన సీఎం చంద్రబాబు ఆగ్రహాన్ని తెలియజేశారు.


ప్రస్తుతం చంద్రబాబు ఢిల్లీలో ఉన్నప్పటికీ అక్కడినుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. రైతుల కోసం ఎన్నో పనులు చేస్తూ ఉన్నామని ఇటీవలే అన్నదాత సుఖీభవ నిధులను జమ చేశామని వారు ఆ సొమ్ముతో ఎరువులు కొనుక్కోవాలని భావిస్తూ ఉంటే దానిని దారి మళ్లించడం సరైనది కాదు అంటు హెచ్చరించారట. అలా ఎక్కడెక్కడ ఎరువులు దారిమళ్లించారో అక్కడ విస్తృతంగా తనిఖీలు చేసి మరి తిరిగి గోడౌన్లలో చేర్చాలని.. అలా పక్కదారి మళ్లించిన వారు ఎవరు ఉన్నా సరే వారి మీద క్రిమినల్ కేసులు పెట్టాలంటూ తెలిపారట సీఎం చంద్రబాబు. మరి ఎవరెవరు ఈ విషయంపై బయటపడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: