
ఇప్పుడు తాజాగా ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ పెద్ద అల్లుడుకి ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది. మంత్రి నారాయణ పెద్ద అల్లుడు పునీత్ సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. వీరు నిర్వహిస్తున్న ఐవీ గ్రీన్ ఇన్ఫ్రా అకౌంటెంట్ నుంచి కేవలం వాట్సాప్ మెసేజ్ ద్వారా పునీత్ అత్యవసరంగా ఈ ఖాతాకు డబ్బులు పంపించాలని రూ.1.96 కోట్ల రూపాయలను ట్రాన్స్ఫర్ చేయాలంటూ ఒక మెసేజ్ పంపించారని దీంతో మెసేజ్ పంపింది పునీత్ అని నమ్మి అకౌంటెంట్ ఏమీ ఆలోచించకుండా ఆ మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేశారట.
అయితే అలా చేసిన కొద్దిసేపటికి తాము మోసపోయామని గుర్తించిన పునీత్.. అకౌంటెంట్ జరిగిన విషయాన్ని కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులు అరవింద్ కుమార్ తో పాటుగా సంజీవను అరెస్టు చేశారు. ఇందులో మరో నిందితుడు పరారీలో ఉన్నట్లుగా తెలుపుతున్నారు. ఈ విషయం పైన పోలీసులకు సరైన సమయంలో సమాచారం ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తమయి రూరల్ పోలీసులు ఆ సైబర్ నేరగాళ్ల నుంచి కోటి రూపాయలకు పైగా ఫ్రిజ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే లాయర్లు సూచన మేరకు రూ .49 లక్షల వరకు విడుదలకు అనుమతి ఇచ్చారు. ఈ సైబర్ కుట్రలో భాగంగా ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నామని తెలుపుతున్నారు.