హైదరాబాదులో ఒక దారుణమైన సంఘటన జరిగింది.. కట్టుకున్న భార్యను సైతం చంపేసి మరి ఆమె మృతుదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశారు భర్త. ఎంతో దారుణమైన ఘటన హైదరాబాదులోని మేడ్చల్ జిల్లా పరిధిలో ఉండే బాలాజీహిల్స్ లో ఈ ఘటన జరిగింది. అయితే అలా మరణించిన మహిళ గర్భవతి కావడం గమనార్హం.  ఆమెను ముక్కలు ముక్కలుగా నరికేసి ఆమె పార్టీలన్నిటినీ కూడా కవర్లో ప్యాక్ చేసి.. బయటపడేసేందుకు సిద్ధమయ్యారు.కానీ రూమ్ నుంచి శబ్దాలు రావడంతో చుట్టుపక్కల వారు వెళ్లి చూడడంతో అసలు విషయం బయటపడింది.



అయితే ఈ విషయం పోలీసుల వరకు వెళ్లగా పోలీసులు నిందితుడు మహేందర్ రెడ్డిని అరెస్టు చేశారు. స్వాతి కామారెడ్డి గూడెం కి  చెందిన మహిళ (మహేందర్ రెడ్డి, స్వాతి)  వీరిద్దరూ ప్రేమించుకొని వివాహం చేసుకొని బోడుప్పల్  లో నివాసం ఉంటున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకొని మరి విచారించగా స్వాతి కాళ్లు, చేతులు, తల వేరుచేసి మూసిలో పడి వేసినట్లుగా మహేందర్రెడ్డి తెలియజేశారట. వాటికోసం పోలీసులు కూడా ప్రత్యేకించి మరి గాలిస్తున్నట్లు తెలియజేశారు. కేవలం చాతి బాగాన్ని మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


హత్యకు గల కారణాల విషయానికి వస్తే.. మహేందర్ రెడ్డి క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. స్వాతితో గృహ కలహల నేపథ్యంలో హత్య చేసినట్లుగా వినిపిస్తున్నాయి. స్వాతి మరణ వార్త విని తల్లి కన్నీరు మున్నీరు అవుతున్నారు. నిందితుడు తల్లిదండ్రులు, బంధువులు సైతం తన బిడ్డను చెప్పి చంపేశారు అంటూ పలు రకాల ఆరోపణలు చేస్తోంది .ఇలాంటి వారికి కఠినంగా శిక్షించాలని స్వాతి బంధువులతో పాటు ఆమె తల్లి కూడా డిమాండ్ చేస్తోంది. అయితే అక్కడ స్థానికులు కూడా మహేందర్ రెడ్డి ప్రవర్తన కూడా చాలా వింతగా ఉండేది అంటూ తెలియజేస్తున్నారు. మరి ఈ విషయం పైన అధికారులు మరిన్ని విషయాలను బయటపెడతారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: