
తర్వాత ఆయన దృష్టి ముఖ్యమంత్రి నివాసం – షాలిమార్ బాగ్ వైపు మళ్లింది. కానీ అక్కడ కూడా కట్టుదిట్టమైన భద్రత ఉండటంతో తన ప్లాన్‌ను వదిలేయాల్సి వచ్చింది. ఆ తరువాత సివిల్ లైన్స్‌లోని సీఎం కార్యాలయం వద్ద జరిగే “జన సునవాయి” కార్యక్రమంలో ప్రవేశించి మళ్లీ ప్రయత్నించాడు. కానీ అక్కడ కూడా భద్రత కఠినంగా ఉండటంతో కత్తిని పడేసి పారిపోయాడు. చివరికి అమలైన దాడి .. మూడు ప్రయత్నాలు విఫలమైనా, దాడి చేయాలనే రాజేష్ సంకల్పాన్ని వదలలేదు. చివరికి జైల్లో ఉన్న తన బంధువును విడిపించమని వినతి పెట్టాలనే పేరుతో జన సువాయికి వెళ్లాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ముఖ్యమంత్రి దగ్గరికి చేరుకున్న రాజేష్, ఆమెను తోసి చెంపపై కొట్టి, జుట్టు పట్టుకుని లాగాడు. తన అసలు కత్తి ప్లాన్ విఫలమైనా, ఈ దాడికి పాల్పడడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది.
స్నేహితుడు కూడా కుట్రలో భాగమే! .. పోలీసుల విచారణలో ఈ ఘటనలో తాహసీన్ సయ్యద్ అనే రాజేష్ స్నేహితుడి పాత్ర కూడా బయటపడింది. దాడికి ముందే తాహసీన్ డబ్బు పంపించాడని, ఇద్దరూ నిరంతరం ఫోన్లో, వాట్సాప్‌లో సంప్రదించుకున్నారని పోలీసులు గుర్తించారు. వారి కాల్ డేటా, చాట్ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా కుట్రే .. ఈ ఘటన ఏదో ఒక్కసారిగా జరిగినదని కాకుండా, పూర్తి ప్రణాళికతో అమలు చేసిన కుట్ర అని పోలీసులు స్పష్టంచేశారు. ప్రస్తుతం రాజేష్ సకారియాతో పాటు అతడి స్నేహితుడు తాహసీన్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ దాడిలో ఇంకా ఎవరెవరు భాగమయ్యారనే అంశంపై దర్యాప్తు మరింత వేగంగా సాగుతోంది.మొత్తానికి, ఒక ముఖ్యమంత్రి ప్రాణాలపై కత్తి ప్లాన్ వేసి దాడి జరగడం దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థలపై పెద్ద ప్రశ్నార్థకంగా మారింది.