ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 14 మాసాలవుతోంది. అయితే ఇందులో భాగంగా కొన్ని సర్వే సంస్థలు ఇప్పటికే తమ అభిప్రాయాలను కూడా తెలియజేశారు. ఇప్పుడు తాజాగా ఒక పొలిటికల్ సర్వే జిల్లాల వారీగా కొన్ని జిల్లాలలో కూటమి నేతలు ఓడిపోయే అవకాశం ఉన్నదంట తెలియజేస్తోంది. సుమారుగా 20 సీట్ల వరకు ఓడిపోయే అవకాశం ఉన్నదంటూ తెలుపుతోంది. అయితే ఈ 20 నియోజకవర్గాలలో కూటమి నేతలు రిపేర్లు చేసుకుంటే కొన్ని ప్రాంతాలలో గెలిచే అవకాశం ఉందని మరికొన్నిచోట్ల ఎంత రిపేరు చేసిన గెలిచి అవకాశం లేదంటూ తెలుపుతున్నారు.



అయితే ఈ 20 నియోజకవర్గాలు  కూటమి ఎమ్మెల్యేల స్వయంకృతాపదాల కారణంగా, లోకల్ లో క్యాడర్ సరిగ్గా లేకపోవడం వల్ల , రకరకాల కారణాలవల్ల ఈ 20 సీట్లు ఓటమి అంచున ఉన్నాయి.. రాయలసీమ నాలుగు జిల్లాలు, ప్రకాశం నెల్లూరు జిల్లాలో మాత్రమే తెలుపుతున్నారు. ఈ ఉమ్మడి ఆరు జిల్లాలలోని 20 నియోజకవర్గాలలో కూటమి నేతలు రెడ్ జోన్ లో ఉన్నారు.


ఉమ్మడి చిత్తూరు జిల్లా:
గంగాధర నెల్లూరు, సత్యవేడు మదనపల్లి.. మరికొన్ని నియోజకవర్గాలు ఆరంజ్ జోన్ లో ఉన్నాయి.


ఉమ్మడి అనంతపురం జిల్లా:
ఇందులో అనంతపురం అర్బన్, శింగనమల, గుంతకల్లు


ఉమ్మడి కర్నూలు జిల్లా:

శ్రీశైలం, ఆళ్లగడ్డ, డోన్, నంద్యాల, నందికొట్కూరు, పాణ్యం

ఉమ్మడి కడప జిల్లా:
రైల్వే కోడూరు, కడప ,

ఉమ్మడి నెల్లూరు:
సూళ్లూరుపేట, ఆత్మకూరు , నెల్లూరు సిటీ

ఉమ్మడి ప్రకాశం జిల్లా:
కందుకూరు, గిద్దలూరు, సంతనూతలపాడు



ఈ ఉమ్మడి ఆరు జిల్లాలలో నియోజవర్గాలన్నీ కూడా రెడ్ జోన్ లో ఉన్నాయి.. మరికొన్ని నియోజకవర్గాలు కూడా ఆరంజ్ జోన్ లో ఉన్నాయని.. త్వరలోనే అందుకు సంబంధించి ap 175 సర్వే తెలియజేస్తామని తెలుపుతున్నారు. అయితే వీటన్నిటినీ కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన రిపోర్టర్ ఆధారంగానే ఫీడ్ బ్యాక్  అందిస్తున్నామంటూ ఒక వీడియో వైరల్ గా మారుతున్నది. 


మరింత సమాచారం తెలుసుకోండి: