
ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందంటే – గత కొన్ని రోజులుగా ఉల్లి ధరలు విపరీతంగా పెరిగాయి. కర్నూలు మార్కెట్‌లో ధరలు కిలోకు రూ.1200 దాకా ఎగబాకాయి. రైతులకు న్యాయం జరగడమే కాకుండా, వినియోగదారులకు తక్కువ ధరకే ఉల్లిపాయలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం మార్క్‌ఫెడ్ అధికారులు మార్కెట్ నుంచి నేరుగా మద్దతు ధరకు ఉల్లిపాయలు కొనుగోలు చేస్తున్నారు. వాటిని గ్రేడింగ్ చేసి రైతు బజార్లు, రేషన్ షాపులు, అన్నక్యాంటీన్లు, హాస్టల్స్, మధ్యాహ్న భోజన పథకం వంటి చోట్ల తక్కువ ధరలకు అందిస్తున్నారు. కేవలం కిలో రెండు కిలోలు మాత్రమే కాదు, రేషన్ కార్డు ఉన్నవారు కావాలనుకుంటే ఎన్ని కేజీలైనా కొనుగోలు చేసే అవకాశం కల్పించింది ప్రభుత్వం.
మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎరువుల సరఫరా విషయంలో తప్పుడు ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. ‘రాష్ట్రంలో యూరియా కొరత లేదు. ఎవరైనా రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు. ఇప్పటికే 6.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేశామని, సెప్టెంబర్ చివరి నాటికి 2.71 లక్షల టన్నులు అదనంగా వస్తాయని వివరించారు. రబీ సీజన్ కోసం 9.38 లక్షల టన్నులు కూడా కేటాయింపులు తెచ్చుకున్నామన్నారు.
ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారాలపై కూడా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల లారీలు హైజాక్ చేశారని, తప్పుడు జియోస్ సృష్టించారని, పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో అబద్ధపు పోస్టులు పెడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి చేసే ప్రయత్నాలను తిప్పికొడతామని, కావాలనే అలజడి సృష్టించే వారిని జైలుకు పంపుతామని స్పష్టంచేశారు. మొత్తం మీద, ఒకవైపు రైతుల ఉత్పత్తికి మార్కెట్ విలువ రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంటే, మరోవైపు వినియోగదారులకు తక్కువ ధరకే ఉల్లి అందించేలా వ్యూహం రూపొందించింది. రైతులు – ప్రజలు రెండింటినీ రక్షించాలనే సంకల్పంతో ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశమైంది.