ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీ మరో 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి రాదు.అలా ఒకసారి వైసీపీ,మరోసారి టిడిపి ఇలా ప్రజలు మార్చి మార్చి ఓట్లు వేస్తూ అభివృద్ధి కావాలని చూస్తారు.అయితే ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఆపోజిషన్ పార్టీ వారికి ఇత్తడే.ఎందుకంటే ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన బాగోతాలన్ని బయటపడతాయి. అలాగే కక్ష్య సాధింపు రాజకీయాలు కూడా ఉంటాయి.. అయితే ప్రస్తుతం ఏపీలో టిడిపి కూటమి అధికారంలో ఉంది.దీంతో వైసిపి హయాంలో చేసిన తప్పులన్నీ బయట పెడుతున్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా వైసీపీలో కీలక నేతలుగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆయన సోదరుడికి మాచర్ల రూరల్ పోలీసులు పెద్ద షాక్ ఇచ్చారు.ఇప్పటికే వీరి మీద కేసు నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే. 

వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో ఏ6  గా పిన్మెల్లి రామకృష్ణారెడ్డి, ఏ7 గా పిన్మెల్లి వెంకట్రామిరెడ్డిలు ఉన్నారు.అయితే గతంలో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఆ తర్వాత సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటికి వచ్చారు.అయితే నేటి బుధవారంతో సుప్రీంకోర్టు ఇచ్చిన మద్యంతర బెయిల్ ముగిసిపోతుంది. దీంతో పిన్మెల్లి సోదరులు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ పై విచారణకు హాజరు కావలసి ఉంది. అయితే బెయిల్ ముగిస్తుంది అని తెలియడంతో మరోసారి వీళ్లు బెయిల్ కి అప్లై చేశారని తెలుస్తోంది. అయితే సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హాజరవ్వాల్సి  ఉండగా సడన్గా మాచర్ల రూరల్ పోలీసులు పిన్మెల్లి సోదరులకు బిగ్ షాక్ ఇచ్చారు. పిన్మెల్లి సోదరులకు మాచర్ల రూరల్ పోలీసులు నోటీసులు ఇవ్వడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. అయితే మొదట పోలీసులు వీరిని జంట హత్యల కేసులో విచారించిన సమయంలో ఇద్దరు అన్నదమ్ముల్ని కలిపి దాదాపు 170,180 ప్రశ్నలు అడిగారు.

 ఆ సమయంలో ఈ ఇద్దరు అన్నదమ్ములు మాకు ఏమీ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం అనే సమాధానాలు ఇచ్చారట. ఇద్దరు సేమ్ టు సేమ్ ఆన్సర్లు ఇవ్వడంతో పోలీసులు సైతం షాక్ అయ్యారట.అంతేకాకుండా నిందితులతో మాట్లాడినట్టు ఫోన్ కాల్స్ సిగ్నల్స్ చెబుతున్నాయని విచారణ అధికారులు చెప్పినప్పటికీ ఆ ఫోన్లను మేము వాడలేదు, ఆ ఫోన్లు ఎవరు వాడారో కూడా మాకు తెలియదు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ టైంలో వీరిని పోలీసులు విచారించి బయటికి పంపించినప్పటికీ మరోసారి మాచర్ల రూరల్ పోలీసులు గుండ్లపాడు జంట హత్యల కేసులో విచారణకు రావాలి అని నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఈ విచారణలో పిన్మెల్లి సోదరులను ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది తెలియాల్సి ఉంది.ఇప్పటికే చాలామంది టిడిపి కూటమి వాళ్లు ఇక పిన్మెల్లి సోదరులకు చిప్పగతే అంటూ ప్రచారం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: