మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయి కేవలం 11 స్థానాలకే పరిమితమయ్యారు. కూటమి భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్నప్పటికీ కూటమిలో సఖ్యత కనిపించకపోవడం, కూటమి నేతలు చేస్తున్న పనుల వల్ల టిడిపి నేతలే ఉచిత ప్రచారాన్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కల్పిస్తున్నట్టుగా కనిపిస్తోంది. కొంతమంది నేతలు చంద్రబాబు, నారా లోకేష్ దగ్గర మెప్పు కోసం వైయస్ జగన్ పైన దుర్భాషలాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా క్రేజ్ పెంచుతున్నాయనే సంగతి మరిచిపోతున్నారు.


ఈనెల 9వ తేదీన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజవర్గంలో పర్యటించబోతున్నారు. అయితే ఈ విషయాన్ని టిడిపి నేతలు పట్టించుకోకుండా ఉండి ఉంటే తలనొప్పి ఉండేది కాదు. జగన్ ని అవమానించాలని, కించపరిచాలని  కొంతమంది నేతలు దురుసుగా ప్రవర్తిస్తూ కూటమికి ఇబ్బంది తెస్తున్నారు. ముఖ్యంగా మెడికల్ కళాశాలల పైన కూటమి ప్రభుత్వం చేసిన ప్రచారం ప్రజలకు తెలిసిపోయింది. వైసిపి హయాంలో అసలు వైద్య కళాశాలల నిర్మాణమే జరగలేదంటూ కొంతమంది కూటమి  నేతలు మాట్లాడిన  వీటిని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.


కొంతమంది టిడిపి నేతలు పదవులను ఆశిస్తూ పెద్దలు మెప్పుకోసం శృతిమించి మరి మాట్లాడుతున్నారు. మరి కొంతమంది మెడికల్ కాలేజీలు ఎక్కడ నిర్మించారో చూపించాలంటూ సవాలు విసిరారు. ఆ సవాల్ కు దీటుగా అక్కడికి జగన్ వెళుతుండడం గమరన్హం. విశాఖ విమానాశ్రయం నుంచి నర్సీపట్నం నియోజవర్గం గుండ భీమబోయినపాలెం వరకు  63 కిలోమీటర్ల రోడ్డు మార్గాన జగన్ వెళ్లబోతున్నారు. ముఖ్యంగా జగన్ రోడ్డు మార్గం అంటే ప్రజలు భారీ ఎత్తున వస్తారని  అధికారులే తేల్చేస్తున్నారు. ఉత్తరాంధ్ర కూటమి ప్రభుత్వం పైన కొన్ని కారణాల చేత జనం కొంత వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది.


ఏడాది క్రితంతో పోలిస్తే వైయస్ జగన్ పైన ఉత్తరాంధ్ర ప్రజలలో కొంతమేరకు ఆదరణ ఇప్పుడు పెరిగినట్టుగా చెబుతున్నారు. మెడికల్ కళాశాల పైన టిడిపి నేతలు జగన్ ను బద్నాం చేయించాలని తాపత్రయంతో చాలా దురుసుగా మాట్లాడి.. జగన్ని క్షేత్రస్థాయిలో పర్యటనలకు వెళ్లేలా చేస్తున్న ఘనత టిడిపి నేతలకే దక్కేలా చేస్తోంది. జగన్ పర్యటన చుట్టూ టిడిపి మీడియా కూడా అప్పుడే చర్చలు జరిపే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా జగన్ పర్యటనలో పాల్గొంటే జనం వస్తారనే భయం కూటమికి ఉంది. అలాగని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం.. అన్నిటిని ఎదుర్కొని ముందుకు సాగిన ధీరుడుగా జగన్ క్రేజ్ పెరుగుతుంది. ఇలా ఎటు చూసినా కూడా జగన్ ప్రయోజనం కోసం కూటమినేతల చర్యలు ఉంటున్నాయనే విధంగా వైసిపి కార్యకర్తలు, నేతలు మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: