ఒకే  రాజకీయ పార్టీలో ఉన్న వారికే అప్పుడప్పుడు పడదు. అలాంటిది రెండు మూడు పార్టీలు కలిపి కూటమిగా ఏర్పడి పోటీ చేస్తే ఆ కూటమి ఎక్కువ కాలం నిలుస్తుందా అంటే అది నిలవదు. ఈ విషయం జగమెరిగిన సత్యం.అయితే ప్రస్తుతం ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉన్న సంగతి మనకు తెలిసిందే..అయితే కూటమిలో ఇప్పటికే ఎన్నో గొడవలు, కొట్లాటలు జరుగుతున్న విషయం కూడా రోజు వార్తల్లో వస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే కూటమిలో ఉండే గొడవలను మనం క్యాష్ చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల సంఘం చూస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి తన సత్తా చాటాలి అని ఆ బాధ్యత అంతా మీ మీదే ఉంది అంటూ జగన్ తాజా సమావేశంలో నేతలకు చెప్పినట్టు తెలుస్తోంది.

జగన్మోహన్ రెడ్డి తాజాగా తాడేపల్లి లోని కేంద్ర కార్యాలయంలో పార్లమెంట్ అబ్జర్వర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు అందరితో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మన రాజకీయం నడవాలి అని దిశా నిర్దేశం చేశారట. ముఖ్యంగా కూటమి వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని తెలిపారట. కూటమిలోని అంతర్గత కుమ్ములాటాలను మన పార్టీ వాళ్లు అనుకూలంగా మార్చుకొని ప్రజల వద్దకు వెళ్లి ఆ వైఫల్యాలను ఎత్తిచూపుతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయం సాధించాలని దిశా నిర్దేశం చేశారట.అంతేకాదు గత కొద్ది రోజులుగా కూటమిలో ఎన్నో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి. ఇక రీసెంట్గా బాలకృష్ణ చిరంజీవిని విమర్శించడం, చంద్రబాబు స్వయంగా వెళ్లి పవన్ కళ్యాణ్ ని కలవడం ఇవన్నీ మనం చూస్తున్నవే.

వీటన్నింటి గురించి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించి వీటిని మనకు అనుకూలంగా మార్చుకోవాలని తెలిపారట. అలాగే కూటమి పైకి బాగా కనిపించినప్పటికీ లోపల మాత్రం ఎన్నో అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఈ కూటమి ఎన్ని రోజులో కలిసి ఉండలేదు. త్వరలోనే కూటమి కూలిపోతుంది అంటూ జగన్ ఆ సమావేశంలో జోస్యం చెప్పారట. అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే మెజారిటీ స్థానాలని గెలిపించుకుంటారో వారికి రాబోవు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో మంచి ప్రాధాన్యత ఉంటుందని కొత్త ఆశలు పెంచారట. మరి కూటమి లో కుమ్ములాటలు కూటమి కూలిపోతుంది అని జగన్ చెప్పిన జోస్యం ఫలిస్తుందా..స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి సత్తా చాటుతుందా అనేది రాబోవు రోజుల్లో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: