
ప్రస్తుతం వైజాగ్‌లో చదరపు అడుగుకు రూ.5,000 నుంచి రూ.10,000 మధ్య ఉన్న భూమి ధరలు - 2035 నాటికి రూ.20,000 దాటిపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐటీ కారిడార్ చుట్టూ లగ్జరీ అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, స్మార్ట్ సిటీ డెవలప్‌మెంట్స్ భారీ స్థాయిలో జరుగుతాయి. ఆఫీస్ స్పేస్‌లు, కో వర్కింగ్ హబ్‌లు, లాజిస్టిక్స్ సెంటర్లకు డిమాండ్ రెట్టింపు అవుతుంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ 2026 జూన్ నాటికి ప్రారంభమవుతుంది. ఈ ఎయిర్‌పోర్టు వైజాగ్‌ను గ్లోబల్ కనెక్టివిటీ కలిగిన మెట్రో సిటీగా మారుస్తుంది. టూరిజం, బిజినెస్ ట్రావెల్ రేట్లు పెరగడం వలన హోటల్ ఇండస్ట్రీ, రిటైల్ స్పేస్‌లు, మాల్స్, కన్వెన్షన్ సెంటర్ల డిమాండ్ కూడా భారీగా పెరుగుతుంది.
ఎయిర్‌పోర్టు చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాలు వేగంగా అర్బన్ జోన్‌లుగా మారిపోతున్నాయి. ప్రస్తుతం అక్కడి భూమి ధరలు ప్రతి ఏడాది రెట్టింపు వేగంతో పెరుగుతున్నాయి. రోడ్డు ప్రాజెక్టులు, మెట్రో రైలు లింకులు, స్మార్ట్ సిటీ మిషన్ వంటి మౌలిక సదుపాయాల వల్ల వైజాగ్ నగరం ముంబై, బెంగళూరు లెవల్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా ఎదిగే అవకాశం ఉంది. 2035 నాటికి వైజాగ్ భారతదేశంలోని అత్యంత ఆకర్షణీయమైన రియల్ ఎస్టేట్ గమ్యస్థానాల్లో ఒకటిగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. గ్లోబల్ కంపెనీలు వస్తే, మార్కెట్ మరింత బూమ్ అవుతుందని అంచనా. పెట్టుబడిదారులకూ, రియల్ ఎస్టేట్ డెవలపర్‌లకూ వైజాగ్ ఇప్పుడు “గోల్డెన్ ల్యాండ్”గా మారుతోంది.